రాముడు, రావ‌ణుడు బాల‌య్యే..


శ్రీ‌రామ‌రాజ్యం సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. పౌరాణిక చిత్రాల‌ని ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో, ఎంతో క‌ళాత్మ‌కంగా తెర‌కెక్కిస్తాడ‌ని పేరున్న బాపు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మ‌ధ్యే రిలీజ‌యిన శ్రీ‌రామ‌రాజ్యం పాట‌లు చాలా బావున్నాయ‌న్న టాక్ వ‌చ్చేసింది. ఇళ‌య‌రాజా సంగీతంలో వ‌చ్చిన ఈ సాంగ్స్ అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు సినిమాల పాట‌ల మాదిరే అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నా య‌న్న పాజిటివ్ టాక్ శ్రీ‌రామ‌రాజ్యం సినిమాపై మ‌రింత ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచాయి. ఈ చిత్రంలో నంద‌మూరి బాల‌య్య రాముడుగా న‌టిస్తున్నాడ‌ని తెలిసిందే..  అయితే తాజాగా ఈ చిత్రంలో బాల‌య్య మ‌రో పాత్ర‌ని కూడా పోషిస్తున్నాడ‌ని, బాల‌య్య రాముడిగానే కాకుండా, రావ‌ణుడిగా కూడా ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడ‌ని నంద‌మూరి అభిమానులు ఊహిస్తున్నారు. బాల‌య్య రాముడుగా, రావ‌ణుడుగా రెండు పాత్ర‌ల్లో క‌నువిందు చేయ‌నున్నార‌న్న వార్త‌ని బాల‌య్య అభిమానులు లీక్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని రాముడి గెట‌ప్‌లో వ‌చ్చిన బాల‌య్య స్టిల్స్ చూసి నంద‌మూరి వంశ అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. రాముడు గెట‌ప్‌లో అచ్చు త‌న తండ్రి ఎన్టీరామారావు లాగే బాల‌య్య ఉన్నాడ‌ని ఆనంద‌ప‌డుతున్నారు. ఇక రావ‌ణుడిగా కూడా బాల‌య్య న‌టిస్తే మాత్రం ఈ చిత్రంలో ఖ‌చ్చితంగా ఆ పాత్ర హైలెట్‌గానే ఉంటుంది. బాల‌య్య అభిమానులు ఊహిస్తున్న‌ట్టుగా రాముడుగా, రావ‌ణుడుగా బాలయ్య క‌నిపిస్తే వారి అభిమానుల‌కే కాకుండా పౌరాణిక చిత్రాల‌ని ఇష్ట‌ప‌డేవారికి కూడా సంతోష‌క‌ర‌మైన వార్తే క‌దా..!

సిహెచెస్కే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!