అయాజుద్దీన్ ప‌రిస్థితి విష‌యం



మాజీ భారత క్రికెట్ జట్టు సారథి, ఉత్తర ప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు పరిసరాల్లోని పుప్పాల్ గూడలో బైక్ రేసింగ్ సందర్భంగా అయాజుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. పొత్తి కడుపులో తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అయాజుద్దీన్‌తో పాటు ఆయనతో ఉన్న పెద్దమ్మ కొడుకు అఫ్జల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆయన మరణించినట్లు కదనాలు వచ్చినప్పట్టికీ తాజాగా అందిన సమాచారం ప్రకారం అయాజుద్దీన్ ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని,  ఆయన సమీప బందువు అజ్మల్ చనిపోయినట్లు అపోలో ఆస్పత్రి అధికారులు ప్రకటించారు. కాని అజార్ కుమారుడు పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. పోలీసులు అయాజుద్దీన్ ను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు చనిపోయారని అంతా భావించారు. కాని డాక్టర్లు తమ శాయశక్తులా కృషిచేయగా, కొంచెం స్పందన కనిపించిందని ఒక వైద్యుడు చెప్పారు. దీంతో మీడియా వద్దకు డాక్టర్లు వచ్చి అయాజుద్దీన్ చనిపోలేదని ప్రకటించారు. అయితే పరిస్థితి మాత్రం అత్యంత విషమం అని ప్రకటించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!