ఆజాద్‌తో చర్చలకు టి-నేతలు రెడీ
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> సోమవారం నాడు జరిగే సంప్రదింపుల ప్రక్రియకు.. 12 మంది సభ్యులను ఎన్నుకున్నామని మంత్రి జానారెడ్డి తెలిపారు. ఆజాద్ తో జరిగే చర్చలకు 12 మందిని ఎన్నుకున్నామ న్నారు. ఒక్కొక్కరు ఒక్కో అంశంపై ఆజాద్ తో చర్చిస్తారని జానారెడ్డి తెలిపారు. మరోవైపు సంప్రదింపుల ప్రక్రియకు స్టీరింగ్ కమిటీలోని 23 మంది సభ్యలూ ఢిల్లీకి వెళ్తారని చెప్పారు. కాగా 2001 నుంచి ఇప్పటివరకు తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటించిన అనుకూల నిర్ణయాలన్నీ.. ఆజాద్ కు వివరిస్తామని.. శుక్రవారం ఆజాద్ తో భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా తెలంగాణపైనే చర్చకు వస్తామని తేల్చిచెప్పారు....