పోస్ట్‌లు

k.narayana cpi manmohansingh soniagandhi congress party political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అధికారం ఇస్తే ప్రధానిని ఉరితీయిస్తా..

చిత్రం
తనకే అధికారం ఉంటే.. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధానమంత్రిని కరెంటు స్తంభానికి కట్టి ఉరితీయించేవాడినని భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.నారాయణ అన్నారు. చోడవరంలో శనివారం సీపీఐ 21వ జిల్లా మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, బడా సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్రం గిరిజ నులను, మత్స్యకారులను, ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందన్నారు. బాక్సైట్, చైనాక్లే గనులకు అనుమతి ఇవ్వడంతోపాటు వాల్‌మార్ట్ వంటి సంస్థలను దేశంలోకి రానిస్తున్న ప్రధానమంత్రిని, తనకేగాని అధికారం ఉంటే ఉరి తీయించే వాడినన్నారు. బెంగాల్‌లో 34ఏళ్ల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడానికి సహకరించిన మావోయిస్టులు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారన్నారు. మావోయిస్టు నేత కిషన్‌జీని బెంగాల్ ప్రభుత్వమే హత్య చేయించిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.