సీన్‌లోకి హైదరాబాద్..!
రాజ్యసభ సభ్యుడు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ అంశంపై పరిష్కారం కోసం కేంద్రం మూడు,నాలుగు రకాల పరిష్కారాలు ఆలోచిస్తున్న నేపధ్యంలో కేశవ రావు హైదరాబాద్ అంశంపై చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. రెండో ఎస్.ఆర్.సికి తాము అంగీక రించజాలమని, కాని హైదరాబాద్ పై చర్చకు సిద్దమని ఆయన అన్నారు. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారిక విధానం రెండో ఎస్ ఆర్ సి అని గతంలో చెప్పేవారు .కాని ఆ దశ దాటి ఉద్యమం చాలా ముందుకు వచ్చినందున ఇప్పుడు రెండో ఎస్.ఆర్.సి ని వేస్తే అది సమస్యను మరింత జాప్యం చేస్తుందని, పైగా రెండో ఎస్.ఆర్.సి కనుక తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం చేస్తే అప్పుడు తెలంగాణ వ్యవహారం మరింత క్లిష్టంగా మారుతుంది. అందువల్ల కేశవరావు ఈ ప ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.కాగా హైదరాబాద్ పై చర్చలకు సిద్దమని కేశవరావు అనడం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్న చాలామందికి బహుశా ఇష్టం ఉండకపోవచ్చు. అయితే కేశవరావు కొంతకాలం పాటు ఆంధ్రకు కూడా రాజధానిగా ఉండడం వరకు అభ్యంతరం లేదని చెప్ప వచ్చు. కాని సీమాంద్ర నేతలు తెలంగాణ రాష్ట్రం అయ్యే పక్షంలో హైదరాబాద్ కేంద్ర...