ఒకటే ఇల్లు.. 323 ఫోన్లు 440 కోట్ల బిల్లు..!
ఆయన గారింట్లో 323 ఫోన్లు వున్నాయంట. ఆయన గారెవరో కాదు, డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, కేంద్ర మంత్రి దయానిధి మారన్ .మారన్ టెలికాం మంత్రి గా చేసిన సమయం లో తన చెన్నై నివాసం లో ఆ ఫోన్లు పెట్టించుకున్నారని అభియోగం. వాటి కోసం భూ గర్భం లో ఒక కేబుల్ కూడా ఏర్పాటు చేసారట. ఈ ఫోన్లను సన్ నెట్ వర్క్ వ్యాపారం కోసం వాడు కున్నారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై సిబిఐ విచారణ జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించినా 44నెలలు నుంచి పట్టించు కోలేదని మీడియా కోడై కూస్తోంది. ఈ ఫోన్ల దుర్విని యోగం వల్ల సర్కార్ కి రూ. 440కోట్ల రూపాయలు నష్టమని అంటున్నారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని మారన్ అంటున్నారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెబుతున్నారు .