పోస్ట్‌లు

katrina kaif rahulgandhi soniagandhi indian bollywood movies bollywood movie news movie reviews movie news cine news movie masala hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నోరు జారినందుకు సారీ..

చిత్రం
కత్రీనా కైఫ్ సారీ చెప్పింది. రాహుల్ గాంధీ సగం భారతీయుడు అని నోరు జారిన కత్రీనాకైఫ్ క్షమాపణలు తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో కత్రినాకైఫ్.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధా నమిస్తూ.. తనలాగే రాహుల్ గాంధీ కూడా సగం భారతీయుడే అని ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అయితే తీవ్రంగా స్పందించారు. అసలు కత్రీనాకైఫ్ అంటే ఎవరో తెలీదన్నారు. ఆమె మాటలకు తను వివరణ ఇస్తూ.. విలేకర్లు గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని తివారీ చెప్పారు. తాను కూడా సగం యురోపియన్, సగం ఏషియన్ అని కూడా చెప్పిందన్నారు. ఈ విషయంపై వివాదం ముసరడంతో.. చివరికి కత్రినాకైఫ్ సారీ చెప్పాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుడు అర్థం వచ్చేలా.. అసందర్భోచితంగా ప్రచురించారని ఆమె చెప్పుకొచ్చారు. అయినా సరే తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలైనా దెబ్బతీసే విధంగా ఉంటే.. అందుకు క్షమాపణ వేడుకుంటున్నట్లు కత్రీనా ప్రకటించారు.