దాడులు జరగనివ్వం, నన్ను నమ్మండి
నేడు ప్రధాని అధ్యక్షతన న్యూఢిల్లీలో శనివారం జరుగుతున్న 15వ జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ప్రధాని మాట్లాడారు. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకోవాలని దీనికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని ఆయన అన్నారు. దేశభద్రతపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సమీక్షిస్తున్నామని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో అణచివేస్తామని, దాడులు జరగకుండా నిరోధించేందుకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కోస్తా తీర ప్రాంతాల భద్రతను పెంచామని, నక్సలిజం సమస్యను అ«భివృద్ధి కోణంలో చూస్తున్నామని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, ఆవిద్య నిర్మూలించి పల్లెలను అభివృద్ధి చేస్తే నక్సలిజం అంతమయినట్లేనని ప్రధాని పేర్కొన్నారు. మతపరమైన హింసను నిరోధించేందుకు మత హింసా కాండ బిల్లును తేవాలని అన్నారు. అయితే ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ...