టి-టిడిపి నాయకుల ధర్నా
తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ లో ఉన్న పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్ని స్తున్నారు.సోమవారంనాడు శాసనసభకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాలు ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే మరో అడుగు ముందుకు వేసి తమ రాజీనామాలు ఆమోదించా లని కోరుతూ అసెంబ్లీ ఎదుట టిడిపి ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు. రాజీనామాల ద్వారా తమ పార్టీ ప్రతిష్టను పునరుద్దరించుకోవాలని, అలాగే పార్టీని తెలంగాణలో పునరుజ్జీవింప చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని వారు కృషి చే్స్తున్నారు.అందుకే ధర్నా కార్యక్రమం కూడా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా కూడా ఈ రాజీనామాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.తాము రాజకీయ ప్రయోజనం కోసం రాజీనామాలు చేయలేదని, తెలంగాణ కోసం రాజీనామా చేశామని పార్టీ శాసనసభ పక్ష ఉప నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా తగ్గితే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. తెలంగాణ జెఎసి తమతో సంబంధం లేకుండా , తమను సంప్రదించకుండానే ఆందోళనకు పిలుపు ఇచ్చిందని అన్నారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారా నే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల కోసం కాక...