పోస్ట్‌లు

as officer k. raju rahulgandhi soniagandhi pranabmukharjee congress party congress manmohan singh soniagandhi political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బ‌డ్జెట్‌కి ఇంకా టైముంది..!

చిత్రం
2012-13 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను మార్చి 9 తేది తర్వాతనే ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అయితే తేది ఖరారు కాలేదని… అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 9 తేది వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. జనవరి 30 తేది నుంచి మార్చి 3 తేది వరకు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున బడ్జెట్‌ను వాయిదా వేసిందన్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి తేదిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.

ఆహార భ‌ద్రత రూప‌క‌ల్పన‌లో ఆంధ్ర ఐఎఎస్ అధికారి

చిత్రం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆహార భద్రత బిల్లును ఆమోదించింది. ఇక ఇది పార్లమెంటుకు రావడమే తరవాయి. ఈ బిల్లు ప్రకారం దేశంలోని అరవైమూడు శాతం మందికి చౌక ధరకు బియ్యం , గోధుమలు వంటి ఆహార ధాన్యాలు లభిస్తాయి.ఈ పధకం కింద ప్రతి నెల పదిహేను కిలోల చొప్పున బియ్యాన్ని పేద కుటుంబానికి అందించాలని పధక రచన చేశారు. ఈ పధకం లోని గుణగుణాలను విశ్లేషిస్తే ఒకరకంగా పేదలకు ఆహార భద్రత చేకూర్చే ఈ పధకం మంచిదే. అదే సమయంలో వ్యవసాయ రంగానికి అసలే పనివారు దొరకని పరిస్థితి ఆ రంగం ఈ స్కీమ్ వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్లవచ్చని కొందరి అనుమానం. గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ వల్లనే సమస్యలను ఎదుర్కుంటున్న వ్యవసాయం , ఈ స్కీమ్ తో మరింత సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది.1982 లో ఎన్.టి.రామారావు తొలుత కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చే పదకాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పట్లో దీనిని నిరర్ధక స్కీమ్ అని విమర్శించినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దానిని మూడున్నరకు పెంచింది. తిరిగి 1994లో కిలో రెండు రూపాయలకే అమలు చేశారు. తదుపరి చంద్రబాబు నాయుడు దాని ధర...