దడ (మూవీ రివ్యూ)
బ్యానర్ : శ్రీ కామాక్షి ఎంతెర్ప్రిసేస్ తారాగణం : నాగచైతన్య, కాజల్, బ్రహ్మానందం, కిల్లీదోర్జి, ధర్మవరపు, వేణుమాధవ్ తదితరులు… విడుదలయిన తేది : Aug 11, 2011 రాజీవ్ (శ్రీరామ్), విశ్వ (నాగ చైతన్య) ఇద్దరూ అన్నదమ్ములు, అనాథలు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళై అమెరికాలో సెటిలవుతారు. అన్నయ్యకి పెళ్ళవుతుంది. విశ్వ కోటీశ్వరుడి కూతురు రియా( కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తాడు. ఒక రోజు మాఫియా డాన్ ఆర్.డి. 100 మంది అమ్మాయిలని అమ్మడానికి సిద్దపడే క్రమంలో ఆ వందమంది అమ్మాయిలను తనకు తెలియకుండానే విడిపిస్తాడు విశ్వ…అందువల్ల ఆర్.డీ.కి వంద కోట్ల నష్టం వస్తుంది. దాంతో విశ్వని చంపటం కోసం ఆర్.డి. ముఠా గాలిస్తుంది. మరో వైపు విశ్వ అన్న కూడా ఆర్.డి. దగ్గరే పనిచేస్తుంటాడు…చివరికి విశ్వ మాఫియా నుంచి ఎలా తప్పించుకున్నాడు..? రియా ప్రేమని పొందుతాడా…? అన్నది మిగగా కథ. ఎనాలసిస్ : ఈ సినిమా కథ, కథనం రెండూ చాలా వీక్‌గా ఉన్నాయి. కథనాన్ని కూర్చడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. ఒక విధంగా చూస్తే దర్శకుడు ఏ సీన్ కి ఆ సీన్ బాగా తీశాడు. కానీ అన్ని సీన్లకూ సమన్వయం...