భారత్‌పై ఉగ్రవాదుల డేగ కన్ను
దేశంలోకి ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చారని పక్కా సమాచారం భారతదేశ అత్యున్నత నిఘా సంస్థ “రా” ప్రకటించింది. దీంతో సరిహద్దుల వెంబడే కాకుండా ప్రధాన నగరాల్లో పోలీసు బలగాలు హై అలర్ట్ ను ప్రకటిం చాయి. అన్ని ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలా ఎక్కువమంది ఉగ్రవాదులు ప్రవేశించారని, వారు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశ ముందని దొరికిన ఓ టెర్రరిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు ఆత్మా హుతి దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వా లను అలర్ట్ చేసింది. దీంతో అన్నిరాష్ట్రాల పోలీ సులు అప్రమత్త మయ్యారు. మమ్మురంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణికులు సిబ్బందికి, పోలీసులకు ప్రయాణికులు సహరించాలని విజ్ఞప్తి చేశారు.