తీగలాగితే డొంక కదిలింది..!
వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమో విజయవాడ తెలుగుదేశం నాయకుడి హత్య తెలియ చేస్తుంది. మనుషుల మధ్య అసూయ,ద్వేషం,ఆగ్రహం, కక్షలకు అది దారి తీస్తుంది.అందులోను ఒక వివాహిత మహిళతో ఈ నాయకుడు పెట్టుకున్న సంబంధం అతని ప్రాణానికే ముప్పు తెచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.తన అనుచరుడిని వేరే పార్టీవారు హత్య చేశారేమోనని అనుమానించి ఫిర్యాదు చేసిన విజయవాడ అర్బన్ తెలుగుదేశం నాయకుడు వంశికి అసలు విషయం తెలిసి మతి పోయినంతపైనందని అంటున్నారు. పైగా వంశికి కూడా మరో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కధనం రాయడం మరో మలుపుగా ఉంది.కొద్ది రోజుల క్రితం వడ్లమూడి మోహన్ అనే తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య నేత మృత దేహం నిడమానూరు హైవే పక్కన కనిపించింది. ఇది రోడ్డు ప్రమాదం అని మొదట పోలీసులు అనుమానించారు. కాని విజయవాడ అర్బన్ తెలుగుదేశం అధ్యక్షుడు వంశి దీనిని హత్యగా అనుమానిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్ధి పార్టీ వారెవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారని అభిప్రాయపడ్డారు.దానితో పోలీసులు దీనిపై విచారణ జరపడం మొదలుపె...