టిడిపితోనే వామపక్షాలు ఉంటాయా..?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడు సోమవారం నాడు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో భేటి అయితే, మంగళవారం నాడు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ తో ప్రత్యేకంగా సమావేశం అవడం విశేషం. దీనిద్వారా చంద్రబాబు ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. తనతోనే వామపక్షాలు ఉన్నాయని ఆయన తన పార్టీ క్యాడరుకు ఒక నమ్మకం కలిగించారు. ప్రకాష్ కారత్ తమకు చంద్రబాబు మిత్రుడని, ఆయనతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. కాగా బర్దన్ తో జరిగిన సమావేశంలో అవినీతికి సంబంధించిన పోరాటంపై , రైతు సమస్యలపై పోరాటంపై చర్చించుకున్నారు. అవినీతి పై పోరాటంలో కొన్ని సమస్యలు ఉంటాయని,వాటన్నిటిని కూలంకషంగా మాట్లాడుకుని పోరాటంలోకి దిగాలని చంద్రబాబు అన్నారు. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ వామపక్షాలు ఇప్పటికీ తెలుగుదేశంతో ఉంటాయన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే అదే సమయంలో సిపిఎం రాష్ట్రనేత బివి రాఘవులు జగన్ తో పొత్తు ఉండదని చెప్పకపోవడం తెలుగుదేశం పార్టీకి కాస్త చికాకు కలిగిస్తోంది.ఒకపక్క సిపిఎం జాతీయ నేతలు తాము తెలుగుదేశంతోనే ఉంటామన్న రీతిలో మాట్లాడుతుంటూ రాఘవులు ఇలా అంటారేమిటని...