టిడిపితోనే వామపక్షాలు ఉంటాయా..?


తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడు సోమవారం నాడు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో భేటి అయితే, మంగళవారం నాడు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ తో ప్రత్యేకంగా సమావేశం అవడం విశేషం. దీనిద్వారా చంద్రబాబు ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. తనతోనే వామపక్షాలు ఉన్నాయని ఆయన తన పార్టీ క్యాడరుకు ఒక నమ్మకం కలిగించారు. ప్రకాష్ కారత్ తమకు చంద్రబాబు మిత్రుడని, ఆయనతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. కాగా బర్దన్ తో జరిగిన సమావేశంలో అవినీతికి సంబంధించిన పోరాటంపై , రైతు సమస్యలపై పోరాటంపై చర్చించుకున్నారు. అవినీతి పై పోరాటంలో కొన్ని సమస్యలు ఉంటాయని,వాటన్నిటిని కూలంకషంగా మాట్లాడుకుని పోరాటంలోకి దిగాలని చంద్రబాబు అన్నారు. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ వామపక్షాలు ఇప్పటికీ తెలుగుదేశంతో ఉంటాయన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే అదే సమయంలో సిపిఎం రాష్ట్రనేత బివి రాఘవులు జగన్ తో పొత్తు ఉండదని చెప్పకపోవడం తెలుగుదేశం పార్టీకి కాస్త చికాకు కలిగిస్తోంది.ఒకపక్క సిపిఎం జాతీయ నేతలు తాము తెలుగుదేశంతోనే ఉంటామన్న రీతిలో మాట్లాడుతుంటూ రాఘవులు ఇలా అంటారేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగానే రాఘవులు వ్యవహరిస్తున్నారని, అంత మాత్రాన టిడిపితో సంబంధాలు పోగొట్టుకున్నట్లు కాదని, స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా స్థాయిలోనే పొత్తులు ఉంటాయని అందువల్ల రాష్ట్రస్థాయి సంబంధాలు పెద్దగా ప్రభావం చూపవని కొందరు అంటున్నారు.అయితే సిపిఐ మాత్రం తాము టిడిపితో పొత్తుతో ఉన్నాం కనుక , విడిపోతేతప్ప, అదే బంధం కొనసాగుతుందని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!