గ్రహణాలు తెచ్చిన విపత్తులు.. (పార్ట్ – 2)


సంపూర్ణ గ్రహణ కాలం: 16వ తేదీ అంటే 15వ తేదీ అర్థరాత్రి దాటిన తరువాత 1.40 గంటలకు
గ్రహణ సమాప్తి కాలం: 16వ తేదీ తెల్లవారుఝామున 3.30 గంటలకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియా, దుబాయ్, ఖతర్, ఒమన్, బహరైన్, సౌదీ అరేబియా, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. జేష్ట నక్షత్రంలో నాలుగో పాదంలో పుట్టిన వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడకూడదు. అలాగే, మూలా నక్షత్రంలోని ఒకటవ పాదంలో పుట్టిన వారు కూడా ఈ గ్రహణ వీక్షణం అశుభమే అవుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్లు గ్రహణ కాలంలో తప్పనిసరిగా చంద్ర, రాహు గ్రహాలకు శాంతి పూజలు చేయాలని అంటున్నారు.
చంద్ర, రాహు ప్రతిమలను దానం చేయడం కూడా మంచిదని వారు సూచిస్తున్నారు.
చంద్రుడు కుజుడితో కలిసిఉన్నందున ఈ గ్రహణం కారణంగా, కొన్ని వైపరీత్యాలు సంభవించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు… భూకంపాలు రావచ్చు. వరదలు చుట్టుముట్టవచ్చనీ, అలాగే, యుద్ధాలు, మారణహోమం తప్పకపోవచ్చుని హెచ్చరిస్తున్నారు. పెను ప్రమాదాలు కూడా చోటుచేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
చంద్రగ్రహణ కారణంగా, భారతదేశంలో ఉన్న వారంతా 15వ తేదీ రాత్రి 9-00 గంటలకే భోజనం పూర్తి చేసుకోవాలి.
ఈ గ్రహణం వల్ల లాభం జరిగే రాశులు…
మకర, మేషం, కన్యా, సింహ రాశుల్లో జన్మించిన వారికి ఈ గ్రహణం శభదాయకమే అంటున్నారు జ్యోతిష పండితులు.
ఇక వృషభ, కర్కాకట, మీన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు, వృశ్చికం, కుంభ, తుల, మిథున రాశులవారికి కీడు చేస్తుందట.

………..

జూన్ 15వ తేదీ సంభవించబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం చుట్టూ అనేక ఊహాగానాలు ముసురుకుంటున్నాయి.
గ్రహణాలకూ, ప్రకృతి విలయాలకూ సంబంధం ఉన్నదని శాస్త్రవేత్తలు, పండితులు చెబ్తూనే ఉన్నారు. ఈసారి సంభవించే చంద్రగ్హరణంకూడా ఉపద్రవాలాను తెచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా జ్యోతిష పండితులు అంటున్నారు. ఈనేపథ్యంలో ఒక్కసారి గతంలో సంపూర్ణ చంద్రగ్రహణ కాలంలో జరిగిన విపత్తుల వివరాలు ఇవి…
2001 జనవరి 9: చంద్రగ్రహణం… అదే నెలలో 21న భారత దేశంలో భూకంపం సంభవించింది.
2003 మే 16: చంద్రగ్రహణం… అదే సంవత్సరం మే 1న తూర్పు టర్కీ ప్రాంతంలో భూకంపం
2003 నవంబర్ 9: సంపూర్ణ చంద్రగ్హహణం… తరువాత వారం రోజులకే అలస్కాలో పెను భూకంపం.
2004 మే 4: సంపూర్ణ చంద్రగ్రహణం… ఏదే నెల 28న ఇరాన్ లో భూకంపం సంభవించింది.
2004 అక్టోబర్ 28: చంద్రగ్రహణానికి ముందే, అక్టోబర్ 23న జపాన్ లో భూకంపం.
2007 మార్చి 3: చంద్రగ్రహణం… మార్చి ఆరున సుమత్రా దీవుల్లో భూకంపం.
2007 ఆగస్టు 28: పెరూలో భూకంపం.
2008 ఫిబ్రవరి 21: చంద్రగ్రహణం సంభవించిన రోజునే ఇండోనేషియాలో భూకంపం. రెక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు.
2010 డిసెంబర్ 21: జపాన్ లో అదే రోజున భూకంపం. తీవ్రత:7.4
సంపూర్ణ చంద్రగ్హరహణం రోజున గతంలో సంభవించిన విపత్తులను గమనిస్తే, రేపు రాబోయే గ్రహణ కాలంలో కూడా అలాంటి కీడు సంభవించవచ్చని జ్యోతిష పండితులే కాదు, శాస్త్రవేత్తలు సైతం భయపడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!