శ‌తాబ్దం త‌ర్వాత‌.. సుదీర్ఘ చంద్ర‌గ్ర‌హ‌ణం


నేడు సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం… శ‌తాబ్దం త‌ర్వాత ఇంత‌టి సుదీర్ఘ చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంది.. ఈ అరుదైన అద్భుతం బుధ‌వారం రాత్రి ఆకాశంలో ఆవిశ్కృతం కానుంది.. చంద్రుడిని భూమి మొత్తంగా క‌ప్పేయ‌డంతో ద‌ట్ట‌మైన గ్ర‌హ‌ణం ఏర్ప‌డనుంది. దాదాపు గంట‌న్న‌ర వ‌ర‌కు భూమిపై క‌టిక చీక‌టిఏర్ప‌డ‌నుంది.. ఇలాంటి గ్ర‌హ‌ణం 2000 జులైలో ఏర్ప‌డింది.. మ‌ళ్ళీ ఈరోజు ఇంత‌టి సుదీర్ఘ చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతుంది. మ‌ళ్ళీ ఇలాంటి గ్ర‌హ‌ణం 130 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌స్తుంది. ఈ గ్ర‌హ‌ణం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు జ‌రుగుతాయ‌ని, విప‌త్తులు సంభ‌విస్తాయ‌ని జ్యోతిష్య శాస్త్ర‌జ్ఞులు చెబుతున్న‌ప్ప‌టికీ ఈ గ్ర‌హ‌ణం వీక్షించ‌డం వ‌ల్ల ఏమీ కాద‌ని, అపోహ‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఇలాంటి అరుదైన చంద్రగ్ర‌హ‌ణాన్ని ప్ర‌తీ ఒక్క‌రు వీక్షించ‌వ‌చ్చ‌ని శాస్ర్త‌జ్ఞులు చెబుతున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ రాత్రి ఓ అద్భుతం ఆవిశ్కృతం కానుంద‌న్న‌ది వాస్త‌వం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!