చిరంజీవి పదవికి ఎవరు అడ్డు?
తిరుపతిలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక వ్యాఖ్య అందరిని ఆశ్చర్యపరచింది. తనకు కేంద్రంలో పదవి అంత ఇష్టం లేదని, రాష్ట్రంలో పదవే ఇష్టమని ఆయన అన్నారు. చిరంజీవి కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్న తరుణంలో ఆయన ఇలా అన్నారేమిటా అని ఆరా తీయడం ఆరంభించారు. అయితే దీనిపై రకరకాల వాదనలు వస్తున్నాయి.చిరంజీవికి కేంద్రంలో పదవి ఇవ్వాలంటే ముందుగా రాజ్యసభ సీటు ఇవ్వాలి. అందుకోసం నేదురుమల్లి జనార్ధనరెడ్డికి ఎక్కడైనా గవర్నర్ పదవి ఇచ్చి, ఆయన ఖాళీ చేసే సీటును చిరంజీవికి కేటాయించవచ్చని అంతా భావించారు. అలా జరిగితే చిరంజీవి తిరుపతి శాసనసభ సీటుకు ఖాళీ చేయవలసి వస్తుంది.ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలో గెలుస్తామా ? లేదా అన్న తర్జనభర్జన ఆరంభమైంది. కొందరు ఈ పాయింటు మీద చిరంజీవిని దెబ్బ తీస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గం వారు ఈ ప్రచారం ఆరంభించారని కధనాలు వస్తున్నాయి. తిరుపతిలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ ఓడిపోతుందని, అందువల్ల అనవసర సమస్యలు వస్తాయని వారు అధిష్టానం వద్ద వాదిస్తున్నారట. దీంతో పరిస్థితి అంతా అయోమయంగా మారిందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే చిరంజీవి ముందు జాగ్రత్తగా తనకు కేంద్రంలో కన్నా రాష్ట్రంలో పదవే ఇష్టమని వ్యాఖ్యానించారని అంటున్నారు.ఒక వేళ రాష్ట్రంలో పదవి అంటే కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అన్నా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక దశలో ఇలాంటి ప్రతిపాదన కూడా వచ్చింది. చివరికి చిరంజీవికి ఏమి చిక్కుతుందో చూడాలి.
congress party
రిప్లయితొలగించండి