ఏరువాక‌కి గ్ర‌హ‌ణం..


ఏరువాక సాగారో ర‌న్నో.. ఓర‌న్నా.. నీ క‌ష్ట‌మంతా తీరునురో.. ర‌న్నో మా య‌న్నా.. అన్న పాట ప్ర‌తీవారి మ‌న‌సులో నాటుకుపోయింది.. ఈ రోజు ఏరువాక పున్న‌మి.. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున క‌ర్ష‌కులు ఏరువాక పున్న‌మి ని జ‌రుపుకుంటారు. కొత్తగా పొలాన్ని దున్న‌డానికి ప్రారంభ‌స‌మ‌యాన్ని ప‌ల్లెల్లో సంతోషంగా జ‌రుపుకునే పండ‌గ‌.. ఈ ఏరువాక పున్న‌మి.. ఈ జ్యేష్ఠ పున్న‌మి రోజున ఉద‌య‌మే ఎడ్ల‌ను క‌డిగి, కొమ్ముల‌కు రంగులు పూసి, గ‌జ్జెలు, గంట‌ల‌తో అలంక‌రించి, ఎడ్ల‌ను క‌ట్టే కాడిని ధూప‌దీప నైవేద్యాల‌తో పూజించ‌డం ప్ర‌తీ ప‌ల్లెలో చేస్తారు. ఈ రోజు ఎడ్ల‌కు పొంగ‌లి పెడ‌తారు. గ్రామంలో రైతులంతా సాయంత్రం వేళ‌లో మంగ‌ళ వాయిద్యాల‌తో పొలాల్లోకి వెళ్ళి దుక్కి ప్రారంభిస్తారు.. ఊరి వాకిట గోగు నార‌తో చేసిన తోర‌ణం క‌డ‌తారు. దాన్ని చెర్నాలకోల‌తో కొట్టి ఎవ‌రికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు.. ఇది ప‌శువుల‌కు మేలు చేస్తుంద‌ని గ్రామ‌స్థుల న‌మ్మ‌కం.. ఇంతటి మ‌హోన్న‌త‌మైన ఏరువాక పున్న‌మికి గ్ర‌హ‌ణం ప‌ట్టింది.. అదే.. ఈ రోజు రాత్రే సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం ఈ చంద్ర‌గ్ర‌హ‌ణం ద్వారా ఎన్నో అన‌ర్థాలు జ‌రుగుతాయ‌ని వినిపిస్తుండ‌డంతో ఇప్పుడు ఈ ఏరువాక పున్న‌మి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!