తెలంగాణకు సోనియా సుముఖమే కాని..
ఎ.ఐ.సి.సి అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయాత్ర ను ముగించుకుని ఢిల్లీ తిరిగి రావడంతో శుక్రవారం సాయంత్రం కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది.ముఖ్యంగా లోక్ పాల్ బిల్లు, తెలంగాణ అంశాలపై చర్చ జరగవచ్చని చెబుతు న్నారు. ముఖ్యంగా మనకు సంబంధించినంతవరకు తెలంగాణ అంశం అత్యంత కీలకంగా మారింది. సోనియా గాందీ ని కలిసి తమ ఆఖరి వినతిపత్రం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దానితోపాటు రాజీనామా లేఖలు కూడా జతపరచాలని భావిస్తున్నారు. కోర్ కమిటీలోతెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసు కుంటే ఇంకా వేరే అవసరం ఉండదు.ఇంకా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే అప్పుడు సోనియాగాంధీ తెలంగాణ నేతలకు అప్పాయింట్ మెంట్ ఇస్తారా? ఇవ్వరా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ప్రధానితోసహా, అదిష్టానం ప్రముఖలంతా కూడా సోనియాగాంధీదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో సోనియాగాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారు? అన్నది కీలకంగా మారింది. అయితే ఆమె తాను సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారా? మళ్లీ కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్, చిదంబరం తదితరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయం చేస్తారు. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకున్నాక , రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిదిన ప్రకటన చేసినట్లు మళ్లీ ప్రకటిస్తారా? లేక కాంగ్రెస్ నేతలకు చెప్పి, అందరిని సిద్దం చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. కాగా ఒక ఎమ్.పి చెప్పినదాని ప్రకారం సోనియాగాందీ తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారు. కాని శరద్ పవార్, మమతబెనర్జీ వంటి నేతలు తెలంగాణ ఇస్తే తమ రాష్ట్రాలలోఎదురయ్యే సమస్యల గురించి ప్రస్తావించి అడ్డుపడుతున్నారట. ఈ పరిస్థితిలో సోనియాగాందీ తెలంగాణకు ఎంతవరకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. అయితే మరో కాంగ్రెస్ ప్రముఖుడు వయామీడియాగా నిర్ణయం ఉండవచ్చని అంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి