మధుయాష్కి టార్గెట్ ఎవరు.. ?


తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోని కొందరు ద్రోహుల వల్లే తెలంగాణ రాష్ట్రం రాకుండా పోతోందని.. అధిష్టానం ప్రాంతీయ బోర్డులకు మొగ్గుచూపుతోందని.. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి ప్రకటించడం సంచలనంగా ఉంది. మొదటిసారిగా తెలంగాణ ఎంపీ ఒకరు తెలంగాణ రాబోవడం లేదన్న దాదాపు విస్పష్టమైన ప్రకటన చేశారు. అయితే మధుయాష్కి ఈ సందర్భంగా తెలంగాణ ద్రోహులంటూ.. కొందరి గురించి ప్రస్తావించారు. అదే సమయంలో ఆయన పేర్లు చెప్పడానికి వెనుకాడీ.. వారెవరో అందరికీ తెలుసని మాత్రం వ్యాఖ్యానించారు. బహుశా ఆయన దృష్టిలో తెలంగాణ కోసం ఢిల్లీ యాత్రకు రానీ.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు.. దానంనాగేందర్, ముఖేష్ లు ఉన్నారని అనుకోవాలి. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు.. కూడా వెళ్లలేదు. వారిలో కొందరు సిటీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే ఢిల్లీ వెళ్లారు. ఇది కూడా ఒక సెట్ బ్యాక్ గా మధుయాష్కి భావిస్తున్నట్లున్నారు. వెళ్లినవాళ్లలో కొంతమంది మంత్రులు, ఎంపీలు తాము రాజీనామా చేయమని బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు మధుయాష్కి కేవలం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రానీ నేతలనే తెలంగాణ ద్రోహులంటారా.. లేక అక్కడికొచ్చి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేతలను ద్రోహులంటారా.. మరో నలుగురు మంత్రలు ఢిల్లీలోనే ఉండకుండా క్యాబినేట్ సమావేశం కో్సం వెనక్కి వచ్చినందుకు తెలంగాణ ద్రోహులంటారా.. లేక ఇంకొందరు మంత్రులు ఎంపీలు.. ఎంతకాలం ఆంధ్రదోపిడి దారులు కాంట్రాక్టర్లుగా ప్రచారం చేసిన సుబ్బిరామిరెడ్డి, జీవీకే రెడ్డి రిసెప్షన్ కు వెళ్లినవాళ్లను ద్రోహులంటారా అన్నది చూడాలి.. అలాగే కొందరు తెలంగాణ ప్రజాప్రతినిధులు బయట ఒకలా మాట్లాడుతున్నారని.. లోపలికివెళ్లి మరోలా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!