తెలంగాణ పై చేతులెత్తేసిన చిదంబరం


తెలంగాణ  అంశం పై ఇప్పట్లో  అఖిల  పక్ష సమావేశాన్ని నిర్వహించలేమని కేంద్ర హొం మంత్రి చిదంబరం  స్పష్టం చేసారు. అఖిల పక్ష సమావేశం జరగనిదే తెలంగాణ అంశం తేలదని ఆయన తేల్చి చెప్పారు.బుధవారం  తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కేంద్రమంత్రి చిదంబరంను కలిసారు తెలంగాణ పై అటో ఇటో తేల్చి  చెప్పాలని ప్రజా ప్రతినిధులు మంత్రి ని కోరగా ఆయన చేతులెత్తేశారు. మీరు తెలంగాణ పై  కోర్  కమిటీ సభ్యులతో మాట్లాడాలని సూచించినట్టు సమాచారం .డిసెంబర్ 9 నాటి  ప్రకటన తన వ్యక్తిగతం కాదని చిదంబరం చెప్పినట్టు తెలుస్తోంది .అఖిల పక్షం  ఏర్పాటు పై  తను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని  చిదంబరం అన్నట్టు సమాచారం. చిదంబరం తో భేటీ 15 నిమిషాల్లోనే ముగిసింది .దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .మంత్రి వ్యవహార శైలి పై నిరసన తెలియ చేస్తూ ఒక లేఖ రాయాలని నిర్ణయించారు. కాగా ప్రజా ప్రతినిధులు  కొందరు రాజీనామా చేయాలని ప్రతిపాదించగా మరికొందరు అందుకు ఆమోదించలేదని  తెలుస్తోంది. ఈ రోజు రాత్రి  ఆర్ధిక మంత్రి ప్రణబ్ తో ప్రజా ప్రతినిధులు సమావేశం కానున్నారు .ఆ సమావేశం లో వచ్చే స్పందనను బట్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని  నిర్ణయించారు. కాగా కాంగ్రెస్ నేతలు ఒక వ్యూహం ప్రకారం  చిదంబరం వద్దకు వెళ్ల లేదని  విమర్శలు వినపడుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!