పోస్ట్‌లు

t-congress mps gulamnabi azad pranab mukharjee congress telangana mps manda jagannatham madhu yashki gutta sukhender reddy political news political articls kcr saparate telangana లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎఫ్‌డిఐల‌పై ప్రణ‌బ్ ప్రక‌ట‌న‌

చిత్రం
పార్లమెంట్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. విపక్ష, భాగస్వామ్య పక్షాల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్న నేపథ్యంలో ఎఫ్ డీఐలపై కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఏకాభిప్రాయం కుదిరేవరకూ ఎఫ్ డీఐలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దాంతో పార్లమెంటును నిర్వహించేందుకు అఖిలపక్షం అంగీకారం తెలిపింది. ఎఫ్ డీఐలపై అనుమతిని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం లోక్ సభలో ప్రకటన చేయనున్నారు. అలాగే రాజ్యసభలో ఆనంద్ శర్మ ప్రకటన చేస్తారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తమ విజయంగా అభివర్ణించాయి.

తెలంగాణ‌మా..? అవిశ్వాస‌మా..?

చిత్రం
శాసనసభలో రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాల మేరకు వ్యవహరిస్తున్నా యి.అవిశ్వాస తీర్మానమా? తెలంగాణ తీర్మానమా? అన్నదానిపై రభస జరుగుతోంది. ప్రభుత్వ విధానలపై తాము అవిశ్వాస తీర్మానం పెట్లాం కనుక దానికి మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలను టిడిపి కోరితే, తెలంగాణ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ టిడిపిని డిమాండ్ చేసింది. కాగా తెలంగాఫై కూడా కాంగ్రెస్ మోసం చేసింది కనుక తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు.తెలంగాణ చర్చకు టిఆర్ఎస్, అవిశ్వాసంపై చర్చకు టిడిపి పట్టుబట్టడంతో శాసనసభ శుక్రవారం ఉదయం కొద్ది సేపు వాయిదా పడింది.అయితే టిఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకుని తెలంగాణ తీర్మానానికి ఎక్కువ పట్టుబట్టుడుతుండడం ఆసక్తికరంగా ఉంది.ఇది కాంగ్రెస్ ను కాపాడడానికేనని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా కాంగ్రెస్ ను రక్షించేందుకే టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంమీద ఇదంతా ఒక గేమ్ ప్లాన్ గా మారింది. ఇదే సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా జరుకుంటుండం ...

త‌ల‌లు తెగిప‌డినా.. త‌ల‌వంచం..

చిత్రం
తెలంగాణ విషయంలో తల తెగినా… తలవంచే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి తప్పా ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వాలకు పట్టవని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం న్యూ డెమోక్రసీ ధర్నా చేపట్టింది. కేసీఆర్, విజయశాంతి, జితేందర్ రెడ్డిలు మద్దతు పలుకుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రభుత్వం తనపై వంద కేసులు పెట్టిందన్నారు. తెలంగాణ ఒప్పందాలను తుంగలోకి తొక్కారని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యమం గమ్యానికి చేరుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు దుబాయిలోనే తెల్లరిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించకుండా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాలూ బాగుపడతాయన్నారు. తెలంగాణ గురించి అంతా తెలిసినా ప్రధాని మౌనంగా ఉంటున్నారని… ఆయన ప్రధానిగా ఉండటం మన కర్మ అని కేసీఆర...