సెటిల్‌మెంట్లే కాదు.. సరసాలు కూడా..
ఫాక్యనిష్టు మద్దెల చెరువు సూరి,అతని అనుచరుడు భానులు తన ఫ్లాట్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసే వారని ప్రముఖ సినీ నిర్మాత శింగనమల రమేష్ చెప్పారు.సిఐడి పోలీసులకు ఆయన ఇచ్చిన వాంగ్మూలం లో ఈ విషయాలను అంగీకరించారు. అనంతపురంలో ఫైనాన్షియర్ల నుంచి ఏభై కోట్ల రూపాయల మేర అప్పు తీసుకుని ఎగవేసినట్లు ఆయన ఒప్పుకున్నారు.అలాగే మద్దెల చెరువు సూరిని హత్య చేసిన భాను తనతో టచ్ లో ఉన్నాడని కూడా ఆయన చెప్పారు.అలాగే మరో ఫైనాన్షియర్ వైజయంతిరెడ్డిని కూడా బెదిరించిన మాట నిజమేనని ఆయన వెల్లడించారు. తన అపార్టుమెంటును కూడా రాసివ్వమని సూరి ఒత్తిడి చేసేవా డని ఆయన అన్నారు. సూరిని భాను హత్య చేస్తాడని మాత్రం తనకు తెలియదని చెప్పాడు. శింగనమల రమేష్ వాంగ్మూలం ఆధారంగా సిఐడి పోలీసులు ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు. చెన్పైలోని రెండు లాకర్లను ఇప్పటికే తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు సమాచారం