అడ్డాగా మారుతున్నఔటర్‌రింగ్‌రోడ్
అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ యాక్సిడెంటుతో ఔటర్‌రింగ్‌రోడ్డు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. విశాలమైన రోడ్లపై మితిమీరిన వేగంతో బైక్‌లు నడుపుతూ చివరికి మృత్యుఒడిలోకి పోతున్న యువతకి ఈ ఔటర్ రింగ్‌రోడ్డు మృత్యువుకి దారవుతుంది. ఔటర్‌రింగ్‌రోడ్.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులని దృష్టిలో ఔటర్‌రింగ్‌రోడ్డుని ఏర్పాటు చేశారని అందరికీ తెలిసిందే.. దీని ముఖ్య ఉద్దేశ్యం ఔటర్ రింగ్‌రోడ్డు గుండా వెళితే ప్రయాణ సమయం చాలా ఆదా చేయడమే కాకుండా ట్రాఫిక్ సమస్యని కూడా నివారించవచ్చని దీనిని ఏర్పాటు చేశారు. కానీ.. అదే ఔటర్ రింగ్‌రోడ్డు ఇప్పుడు అసాంఘీక పనులకి అడ్డాగా మారుతున్నది. కోటీశ్వరుల పిల్లలు తమ జల్సాలని తీర్చుకోవడానికి ఈ ఔటర్ రింగ్‌రోడ్డుని చక్కగా వాడుకుంటున్నారు. తండ్రులు సంపాదించిన డబ్బుతో జులాయిగా తిరిగే కొందరు అతి ఖరీదైన బైక్‌లపై, అతివేగంగా ప్రయాణం చేయడం సాధారణమైపోయింది. అంతే కాదు.. వీకెండ్ పార్టీలంటూ శని ఆది వారాలలో బైక్ రేసింగ్ పోటీలకి దిగు...