జయ భోగం మొదలయ్యింది…
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి పసిడి మీద ఎంతో మక్కువ. ఒంటినిండా బంగారు అభరణాలతో అలంకరణ చేససుకోవడమంటే ఏమకు ఎంతో ఇష్టం.. ఎక్కడికి వెళ్ళినా ఒంటినిండా ధగధగలాడే బంగారు ఆభరణాలు ధరించడం ఆమెకు అలవాటు. అయితే ఉన్నట్టుండి 14 సంవత్సరాల పాటుగా బంగారు ఆభరణాలు ధరించుకోవడం మానేసింది.. రాజకీయాల్లోకి వచ్చాక ఆమె అలంకరణకి దూరం కాకుండా నిండు మేకప్‌తో బంగారు ఆభరణాలతో పార్టీ సభలకి వచ్చేది. అయితే ఆమె దర్పాన్ని చూసి కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసారు. అలా దర్పం ప్రదర్శిస్తే ప్రజల మనిషిగా గుర్తింపు పొందడం కష్టమని ఆమెకు వారు చెప్పడంతో అప్పటినుండి ఆమె బంగారు ఆభరణాలు ధరించడమే మానేసింది.. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ బంగారు ఆభరణాలు ధరించడం మొదలెట్టింది. తన చిరకాల ప్రత్యర్థి అయిన కరుణానిథిని చిత్తుగా మట్టి కరిపించినందుకు, తాను తిరుగులేని నాయకురాలిగా సిఎం. పీఠం అధిష్టించినందుకు గాను ఆమె మళ్ళీ మునుపటిలా పసిడి భోగాన్ని అనుభవిస్తుందని తమిళ తంబిలు అభిప్రాయపడుతున్నారు.