పోస్ట్‌లు

madhuri dixit tv channel bollywood news bollywood articls bollywood movies movie reviews movie gossips movie articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

టివి ఛానెల్ పెడుతున్న మాజీ హీరోయిన్‌

చిత్రం
ధక్.. ధక్ లేడీ .. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మళ్లీ భారత్‌కు రానున్నారు. సరికొత్త ఎజెండాతో దేశంలో అడుగు పెట్టనున్నారు. ఏంటీ ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది అని అనుకుంటున్నారు కదా..! తెరపై కనిపించి ప్రేక్షకులను మళ్లీ ఉర్రూతలూగిస్తుందని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే..! ఆమె సొంతంగా కొత్తగా టీవీ చానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు ముంబై మిర్రర్ తెలిపింది. ఆమె దీనిపై కసరత్తు ప్రారంభించినట్టు, దీని కోసం కొత్త బృందాన్ని ఏర్పాటు చేసే పనిలో పడినట్టు పత్రిక వెల్లడించింది. వచ్చే జూన్‌లో చానల్ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఆమె చానల్ క్లిక్ కావాలని ఆశిద్దాం.. ఓకే… ఆల్ ది బెస్ట్ మాధురి.