పోస్ట్‌లు

telangana soniagandhi pranabmukharjee t-congress leaders keshavarao ponnam prabhakar janareddy ap political news poligical hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

టి-నేతల‌ను బుజ్జ‌గించే ప‌నిలో బొత్స‌..

చిత్రం
తెలంగాణ మంత్రుల రాజీనామాలను ఉపసంహరింప చేసేం దుకు వారితో తిరిగి విధులు నిర్వర్తింప చేసేందుకు పిసిసి అద్య క్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల దీక్ష ఆందోళన పూర్తి అయ్యాక వారిని బుజ్జగించడానికి మళ్లీ కృషి చేస్తున్నారు. పిసిసి అద్యక్షుడు బొత్సతో జరిగిన సమావేశానికి మంత్రులు గీతారెడ్డి, శంకరరావులు మినహా పదిమంది మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి గీతారెడ్డి గురుపూర్ణిమ సందర్భంగా పుట్టపర్తి వెళ్లారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త భీష్మించుకొని రాజీనామాలపై పట్టుదలతో ఉన్నారన్న అభిప్రాయం ఉంది. ఆయనను కూడా భేటీకి రప్పించేందుకు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా మంతనాలు జరిపారు.పిసిసి అద్యక్షుడు బొత్స తెలంగాణ మంత్రులతో జరిపే చర్చలు ఎంతవరకు ఫలిస్తాయన్నది చెప్పలేం. ఎందుకంటే మంత్రి జానారెడ్డి వంటివారు తీవ్రంగా మాట్లాడారు.మరి వారంతా రాజీ పడతారా అన్నది సందేహమే. ఏదో ఒక పరిష్కారం లేకుడా రాజీనామాలు ఎలా ఉపసంహరించాలన్నది వారి సమస్యగా ఉంది.