ఉగ్రవాదానికీ వర్షానికీ లింక్ ?
వర్షం కురిసేరోజుల్లోనే ఉగ్రవాదుల దాడులుకు దిగడం కేవలం కాకతాళీయ సంఘటనగా కొట్టిపారేయడానికి వీల్లేదు. మొన్నీమధ్య ముంబాయిలో పేలుళ్లు జరిగినప్పుడు కూడా వర్షం పడింది. అంతేకాదు, నాలుగేళ్ల కిందట హైదరాబాద్ లో జంట పేలుళ్లు జరిగినప్పుడు కూడా జోరుగా వర్షం పడుతోంది. వర్షం కురిసే రోజుల్లోనే ఉగ్రవాద మూకలు దాడులకు దిగడం వ్యూహాత్మకంగానే జరుగుతుందన్న వాదనలు బలపడుతున్నాయి. దాడి అనంతరం జరిగే దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండాలంటే అందుకు తగ్గ వాతావరణం వర్షం కల్పిస్తుంది. కీలక ఆధారాలు వాన నీటిలో కొట్టుకుపోతాయి. ఇది గమనించే ఉగ్రవాదులు వాతావరణ పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. వర్షం పడే సమయంలోనే ఉగ్రవాదులు దాడులకు దిగడం వెనుక మరో కారణంగా ఉంది. నిత్యం జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు జనసాంద్రత దుకాణాలు, హోటళ్ల వద్ద ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో బాంబు బ్లాస్ట్ లు జరిగినప్పుడు పరిస్థితి ఇదే. సరిగా ఇలాంటి సమయంలోనే ఉగ్రవాద...