పోస్ట్‌లు

rajul gandhi youth congress president ap political news political news political articls hot news hot articls hot articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

యూత్‌కాంగ్రెస్ పై అంద‌రి క‌న్ను..

చిత్రం
యువనేత రాహుల్ గాందీ యువజన కాంగ్రెస్ వ్యవహా రాలను పర్యవేక్షిస్తుండడంతో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మంచి గిరాకి ఏర్పడింది. పలువురు మంత్రుల కుమారులు, ప్రముఖుల పిల్లలు ఈ పోస్టు కోసం వీర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలలో యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, ఆఫీస్ బేరర్ల ఎన్నికలు పూర్తి అయ్యాయి. వచ్చే నెలలో ఎపిలో కూడా జరగవచ్చని చెబుతున్నారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానిగా అందరూ భావిస్తుండ డంతో యువజన కాంగ్రెస్ ద్వారా ఆయనకు సన్నిహితం అయ్యే అవకాశం ఉంటుంది. పైగా రాజకీయాలలో ఎదగ డానికి ఇది ఒక మెట్టు అవుతుంది. దాంతో ప్రస్తుతం పోటీపడుతున్నవారిలో ముగ్గురు మంత్రుల కుమారులు ఉన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర, మార్కెటింగ్ శాఖ మంత్రి ముకేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ లు ఈ పదవిని ఆశిస్తున్నారు. ఇక ఇతర ప్రముఖులలో సికింద్రాబాద్ ఎమ్.పి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్, మాజీ మంత్ర...