సోనియాగాంధీకి శస్త్ర చికిత్స
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థకి గురయ్యారు. చికిత్స నిమిత్తమై ఆమె అమెరికా వెళ్లారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను ఆమె నలుగురు నాయకులకు అప్పగించారు. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అమెరికాలో సోనియాకు శస్త్ర చికిత్స జరిగిందని రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది చెప్పారు. దీంతో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు షాక్ తగిలినట్లే. తెలంగాణపై సోనియా వస్తే గానీ తేలే పరిస్థితి ఉండదని పార్టీ అధిష్టానం వారికి చెప్పి వెనక్కి రావాలని అడిగే అవకాశం ఉంది. తెలంగాణ బంతి సోనియా కోర్టులో ఉండడంతో, ఇప్పుడు ఆమె అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం తెలంగాణ గురించిన టి-కాంగ్రెస్ కార్యక్రమాలు సోనియా అమెరికా నుండి తిరిగి వచ్చేంత వరకు బ్రేక్ పడినట్ట...