పోస్ట్‌లు

t-congress leaders janareddy keshavarao ponnam prabhakar saperate telangana political news political articls political hot news komatireddy venkatareddy lingayya లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణ కోసం మ‌రో రాజీనామా

చిత్రం
నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పై ప్రకటన చేయకపోతే ఈనెలాఖరుకు రాజీనామా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన తర్వాత ఆయన ముఖ్య అనుచరుడు అయిన లింగయ్య ముందుగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తెలగాణ సాధనలో భాగంగా, సకల జనుల సమ్మెలో మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు లింగయ్య తెలిపారు.తన రాజీనామాను ఫాక్స్ ద్వారా పంపించారు.అయితే మామూలుగానే రాజీనామాలు ఆమోదించకపోతే, ఫాక్స్ ద్వారా పంపితే స్పీకర్ ఆమోదిస్తారా అన్నది సందేహాస్పదంగా ఉంది.మంత్రి కోమటిరెడ్డి గత కొంతకాలంగా క్యాబినెట్ సమావేశాలకు కూడా వెళ్లడం లేదు. కోమటిరెడ్డి సలహా మేరకే లింగయ్య రాజీనామా లేఖ పంపించి ఉంటారని భావిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ అదిష్టానంపై, అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచడం దీని లక్ష్యంగా భావిస్తున్నారు.