పోస్ట్‌లు

ponnam prabhakar lagadapati rajagopal telangana samaikhyandhra congress party ap political news ap political articls trs kcr ktr లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ల‌గ‌డ‌పాటికి కౌంట‌ర్‌గా పొన్నం రాజీనామా..!

చిత్రం
విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ విమర్శకు బదులుగా కరీంనగర్ లోక్ సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఎమ్.పిల ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేశానని, లగడపాటి రాజగోపాల్ మాదిరి వ్యాపారవేత్తలకు రాజకీయాలకు అవకాశాలు ఇవ్వరాదని రాహుల్ గాందీని కోరతానని చెప్పారు. ఈ రోజు నుంచే ఆంద్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, ఆంద్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని ఏర్పడడానికి ఇదే నాంది కావాలని ప్రభాకర్ అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, దానిని లగడపాటి రాజగోపాల్ వ్యతిరేకించారని , పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని ప్రభాకర్ తెలిపారు. రాజగోపాల్ కార్యక్రమాలను అన్నిటిని తెలియచేయవలసి వస్తుందని, విజయవాడ వచ్చే ఆ విషయాలను వెల్లడిస్తామని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నికయ్యారు కనుక తెలంగాణ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారని అన్నారు. తాను సోనియాగాంధీకి రాజీనామా లేఖ అందచేస్తానని ప్రకటించారు. తన రాజీనామాతో తెలంగాణ ఏర్పాటు కు అంకురం కావాలని అన్నారు.