పోస్ట్‌లు

delhi high court delhi terrarisium alkhaida bomb blost india news national news. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఢిల్లోలో హైకోర్టునందు బాంబ్ బ్లాస్ట్‌

చిత్రం
ఢిల్లీ హైకోర్టు దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం ఉదయం 10:17 గంటలకు గేటు నెంబర్-5 వద్ద గల పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దాదాపు 25 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురు లాయర్లు ఉన్నట్లుతెలుస్తోంది..  ఘటనాస్థలంలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే క్షతగాత్రులను సఫ్దర్‌గంజ్, రామ్‌మనోహర్ లోహిమా ఆస్పత్రులకు తరలించారు. కోర్టు వద్ద బాంబు పేలుళ్లు నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. పేలుళ్లతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. పేలుడు సమాచారంపై నివేదికను అందజేయాలని ఢిల్లీ పోలీసులకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘ‌ట‌న‌తో దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

బాంబు పేలుడుతో ఉలిక్కిప‌డ్డ ఢిల్లీ..

చిత్రం
ఢిల్లీహైకోర్టు వద్ద బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించ‌డంతో ఢిల్లీ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అత్యంత భ‌ద్ర‌తా ప్ర‌దేశం క‌లిగిన హైకోర్టు స‌మీపంలోనే బాంబు పేలుడు సంభ‌వించ‌డం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.  ఈ పేలుడుకు కారణం తెలియలేదు. గేట్ నెంబర్ మూడు వద్ద పార్క్ చేసిన ఓ కారులో పేలుడు సంభవించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపింది. పేలుడు స్వల్పమైనదేనని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి ప్రక్కన్ను కొన్ని వాహనాలు ధ్వంసమైనాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమాని పేరు తెలియాల్సి ఉంది.