ఆయన పెట్టేవాడు.. ఈయన కొట్టేవాడు..
విజయవాడ ఎంపీ.. లగడపాటి రాజగోపాల్ మరోసారి జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఇష్టానుసారం ప్రవర్తిస్తే.. సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. విజయవాడలో విలేకర్లతో మాట్లాడిన లగడపాటి.. జగన్ పార్టీ ఓ సర్కస్ కంపెనీతో పోల్చారు. సాక్షిలో తనపై ఇష్టానుసారంగా కథనాలు వస్తున్నాయని.. దీనిపై త్వరలోనే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని లగడపాటి చెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా కథానాలు ప్రసారాలు వస్తే.. చూస్తూ ఊరుకోనని లగడపాటి తేల్చేశారు. తాను తలుచుకుంటే 100 ఛానెళ్లు పెడతానని చెప్పుకొచ్చారు. ఇకపై తాను సాక్షి పత్రికను కానీ.. టీవీని కానీ చూడనని చెప్పేశారు. ఇలాంటి బెదిరింపులు చాలానే చూశానని.. వీటికి బెదిరేది లేదన్నారు. సాక్షి కథనాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తానని.. దీనిపై పోరాడతానని చెప్పారు. సాక్షి మీడియా కాంగ్రెస్ కోసమే అని ఆనాడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు కానీ.. ఇప్పుడది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. సొంత ఆస్తిలాగా జగన్ దాన్ని పట్టుకుపోయారని అన్నారు. వైఎస్ ఇందిరమ్మ రాజ్యం కావాలని పోరాడితే.. జగన్ అదే కాంగ్రెస్ ను ఎందుకు కాదంటున్నారని మండిపడ్డారు. వైఎస్ కొడుగ్గా.....