కాకరకాయ – మిస్టరీ
కాకరకాయ చేదుగా ఉంటేఉండవచ్చు. కానీ శరీరానికి మేలు చేస్తుందన్న నమ్మకం మనదేశంలో చాలామందిలో ఉంది. షుగర్ వ్యాధికి దివ్యౌషధంగా పనికొస్తుందాలేదా అన్నది తేల్చడం కోసం ఇప్పుడు మూడు దేశాల శాస్త్రవేత్తలు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాకరలోని కెమికల్ మిస్టరీ ఏమిటి అన్నది తెలుసు కుందాం..! తింటే గారెలేతినాలని అన్నారేగానీ, కాకర తినమని ఎవ్వరూ చెప్పలేదని అనుకుంటున్నారా…? అలా ఫిక్సైపోకండి. ఎందుకంటే, డయాబెటిక్ పేషెంట్స్ కాకర తినాలంటూ శాస్త్రీయంగా చెప్పేరోజు త్వరలో వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే, ఈ దిశగా తాజా పరిశోధనలు జోరుజోరుగా సాగిపోతున్ాయి. మనదేశంలో ఎక్కువగా దొరికే కాకరకాయలోని ఔషధగుణాలపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. షుగర్ వ్యాధికి చేదుమందు ఇస్తారు.. అంటే కాకరకాయ తింటే వ్యాధి తగ్గిపోతుందా? అన్నది తెలుసుకోవడానికి `ప్రాజెక్ట్ బిట్టర్ గార్డ్’పేరిట పరిశోధనలు జరుగుతున్నాయి, త్వరలోనే కాకరకాయలోని కెమికల్ మిస్టరీని శాస్త్రవేత్తలు చేధించబోతున్నారు.. దీనికోసం భారత్...