పోస్ట్‌లు

sakshi sakshi media jagan jailukelite special article ap political article hot toppic hot news hot articls political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్ ఏం చేయబోతున్నారు?

చిత్రం
షాక్ మీద షాక్… కేసు మీద కేసు…ఉచ్చు పక్కనే ఉచ్చు…ఇదీ కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాజా పరిస్థితి. ఒక పక్క సీబీఐ దర్యాప్తు, మరో పక్క ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. దీంతో భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నది అద్దంలో కనిపిస్తున్నట్టు ఫీలైపోతున్నారు. సీబీఐ దర్యాప్తు సాగుతున్నా తన కంపెనీల్లో సోదాలు ముమ్మరం చేసినా పైకి నదురుబెదురు కనిపించకుండా ఓదార్పు యాత్రని కొనసాగిస్తూ వచ్చిన జగన్ కు మంగళవారం  (30-08-11) రాత్రి మరో షాక్ తగిలింది. ఈడీ కూడా చురుగ్గా స్పందించింది. సీబీఐ ఇంతకు ముందు ఎఫ్.ఐ.ఆర్ ను తయారుచేసినట్టుగానే, ఈడీ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (దీన్నే ఇసీఐఆర్ అంటారు) ను నమోదు చేసింది. పైగా, జగన్ ను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. ఈయనపై పెట్టిన కేసులు కూడా సామాన్యమైనవి కావు. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ సీ), విదేశీ ద్రవ్య నిర్వాహక చట్టం (ఫారెన్ ఎక్స్చేంజ్ మేన...

దేవుడు చూసుకుంటాడు..

చిత్రం
తన ఆస్తులపై సిబిఐ దాడులు చేయడం జగన్ నేరుగా స్పందించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.అంతా దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనవైపే ఉన్నాడు.వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అప్రదిష్టపాలు చేయడానికి చూస్తున్నారు అని మాత్రమే వ్యాఖ్యానించి ఊరుకుంటున్నారు.సిబిఐ దాడుల నేపధ్యంలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నట్లు కనిపిస్తుంది. సిబిఐ దాడులు పూర్తి అయి వారు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత జగన్ పూర్తి స్థాయిలో స్పందించే అవకాశం కనబడుతోంది.కాగా చంద్రబాబు మీద మాత్రం ఆయన విరుచుకుపడ్డారు.రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నిస్తున్నారు.వై.ఎస్ తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు మరచిపోయి వై.ఎస్.కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్, టిడిపి లు నైతిక విలువలు మర్చి కుమ్మక్కయ్యాయని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వీరికి డిపాజిట్లు రాకుండా ఓడిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం కృష్ణ జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ ఉన్నారు. వర్షంలో సైతం ఆయన తన యాత్ర కొనసాగించారు. న...

జ‌గ‌న్ ఆస్తుల‌పై సిబిఐ సోదాలు..

చిత్రం
జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌పై సిబిఐ సోదాలు మొద‌ల‌య్యాయి. అలాగే సైనిక్‌పురిలోని నిమ్మగ‌డ్డ ప్రసాద్‌, ‌హీంద్రాహిల్‌లోని ధ‌న‌ల‌క్ష్మీ కాల‌నీలోని ఐఏఎస్ అధికారి ఆచార్య ఇంట్లోనూ సిబిఐ సోదాలు మొద‌ల‌య్యాయి. జ‌గ‌న్ ఇంట్లోకూడా సిబిఐ సోదాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అలాగే ప‌లు బృందాలుగా విడివ‌డి అరబిందో ఫార్మా, ఏకే దండమూడి, యూనిటెక్, వ్యాన్ పీక్, హెట్రో డ్రగ్స్, గిల్ క్రిస్ట్, గిల్ క్రిస్ట్ ఇండియా, ఏపీఐఐసీ పొల్లేపల్లి సెజ్, హెట్రో హెల్త్ కేర్, పయనీర్స్, పీవీసీ వెంచర్స్, కార్మిల్ ఏషియా, జననీ ఇన్ ఫ్రా, ఇండియా సిమెంట్స్, క్లాసిక్ రియాల్టీ, జీ 2, పివీపీ ఇన్ ఫ్రా, ఏపీ ఎండీసీ, సండూర్ పవర్స్, సందేశ్ ల్యాబ్స్, జగతీ పబ్లీకేషన్స్, భారతీ సిమెంట్స్, జూబ్లీ మీడియా, ఆల్ఫా అవెన్యూస్, ఆల్ఫా విల్లాస్, ఇండియా బుల్స్, అపర్ణ, ఫ్యూమ్ సొల్యూషన్స్ ల‌లో అధికారులు సోదాలు నిర్వహించే అవ‌కాశం ఉంది.

జ‌గ‌న్ జైలు కెళ్తే పై విశేష స్పంద‌న‌..

చిత్రం
ప్రస్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జ‌గ‌న్ ఆస్తుల‌పై సిబిఐ విచార‌ణ నేప‌థ్యంలో వైఎస్‌. జ‌గ‌న్ భ‌విత‌వ్యం ఏమిట‌న్నది ఈ కేసుపై ఆధార‌ప‌డి ఉండ‌డంతో ఈ అంశాన్ని స్పృషిస్తూ ప్రముఖ ర‌చ‌యిత‌, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు శ్రీ తుర్లపాటి నాగ‌భూష‌ణం గారు ర‌చించిన జ‌గ‌న్ జైలుకెళితే..? ‌వ్యాసాని‌కి విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది.. వాటిని య‌థాత‌దంగా పాఠ‌కుల‌కు అందిస్తున్నాము.. 1. ఎలాంటి రాజకీయానుభవం లేకుండా మా నాన్నగారు ముఖ్యమంత్రిగా పని చేశారు కనుక నాకూ ముఖ్యమంత్రి పదవి కావాలి అంటే జగన్‌కి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు? ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో సిసి కెమెరా ఆపరేటర్‌గా పని చేసిన మా నాన్నగారు చనిపోతేనే ఆయన ఉద్యోగం నాకు గానీ మా తమ్ముడికి గానీ ఇవ్వలేదు. కీలకమైన ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా కావాలంటే ఎవరిస్తారు? Praveen Sarma 2. Praveen Sarma గారికి , మన దేశములో మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అన్ని పదవులు ఎలాంటి రాజకీయానుభవం లేకుండా వారసత్వముగా వచ్చినవే. ఇప్పుడు మన రాష్ట్రం లొ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు, స్పీకర్ , డిప్యూటి స్పీకర్ , హోం మంత్రి , ఇంక...