పోస్ట్‌లు

helicoptor kanna lakshmi narayana nitin gadkari home minister chidambaram kashmir helicoptor crashing ap political news ap political setairs లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

హ‌మ్మో.. హెలిక్యాప్ట‌ర్‌..

చిత్రం
 హెలిక్యాప్ట‌ర్ పేరు వింటేనే ఇప్పుడు నాయ‌కులంద‌రూ మాకుమ్మ‌డిగా అంటున్న మాట హ‌మ్మో హెలిక్యాప్ట‌ర్ అని.. ఈ మ‌ధ్య హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదాలు చాలా జరుగుతుండ‌టంతో నాయ‌కుల హెలిక్యాప్ట‌ర్‌ ల‌కి దూరంగా ఉండ‌డానికి మ‌క్కువ చూపుతున్నారు.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి వ‌స్తే త‌ప్ప హెలిక్యాప్ట‌ర్ జోలికి వెళ్ల‌డం లేదు.. మొన్న‌టికి మొన్న బార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు గ‌డ్కారి నితిన్ గ‌డ్కారి ప్ర‌యాణిం చిన హెలిక్యాప్ట‌ర్ అత‌న్ని విడిచి తిరిగి వెళుతున్న స‌మ‌యంలో ప్ర‌మాధానికి గురైంది.. ఈ విష‌యం తెలిసి నితిన్ ఎంత‌లా వ‌ణికిపోయాడో.. తాజ‌గా కాశ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న హోం మినిస్ట‌ర్ చిదంబ‌రం ప్ర‌యాణి స్తున్న హెలిక్యాప్ట‌ర్‌లో ఏదో సాంకేతిక లోపం గ‌మ‌నించిన ఫైల‌ట్ రిస్క్ తీసుకోకుండా వెంట‌నే అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేసాడు. హెలిక్యాప్ట‌ర్‌ని న‌మ్ముకుంటే ఏ క్ష‌ణాన ఏమ‌వుతుందోన‌ని ఊపిరి బిగ‌ప‌ట్టి ప్ర‌యాణిం చాల్సి వ‌స్తోంద‌ని నాయ‌కులు వాపోతున్నారు.. మ‌రి.. ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఎవ‌రు చూపుతారు..? అన్న‌ది ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది..