భూ.. తో భయపెడతాడా..? నవ్విస్తాడా..?
రాంగోపాల్‌వర్మ పేరు చెప్పగానే దెయ్యాల సినిమాలు గుర్తుకి వస్తాయి.. నిజానికి వర్మకి దెయ్యాలంటే చచ్చేంత భయం.. కానీ దెయ్యాల సినిమాలని తీయడం మాత్రం వర్మ చచ్చినా ఆపడు.. అదేంటో.. అప్పుడెప్పుడో రాత్రి, దెయ్యం అని కొన్ని సినిమాలు తీసి ప్రేక్షకులని కొంచెం భయపెట్టించడానికి ప్రయత్నించినా.. ఈ మధ్య ఆయన ఫ్యాక్టరీ నుండి వచ్చిన దెయ్యాల చిత్రాలని చూసి దెయ్యాలు కూడా (ఉంటే) నవ్వుకునే స్థాయిలో ఉంటున్నాయంటే.. ఆయన జనాలని ఎంతగా భయపెడుతున్నాడో అర్థమవుతుంది.. అంతేకాకుండా ఆ మధ్య వచ్చిన ఫూంక్ చిత్రాన్ని ఒంటకిగా ధియేటర్‌లో చూసిన వారికి పదిలక్షల రూపాయలిస్తానని ఛాలెంజ్ చేసి డిఫరెంట్ పబ్లిసిటీతో ఊదరగొట్టాడు.. దాంతో ఆ చిత్రం ఎంతగా భయపెడుతుందో అనుకున్నారంతా.. కానీ.. ఆ సినిమాకి భయపెట్టేంత సీన్ లేదని తేలేసరికి వర్మ కేవలం పబ్లిసిటీ స్టంట్‌కోసమే అలా చేసాడని తెలిసిపోయింది. ఇప్పుడు తాజాగా భూ.. అనే చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. భూత్ అనే చిత్రం ఆల్రెడీ ఆయనే తీసాడు.. ఇప్పుడు ఈ భూ.. ని ఆయన గత దెయ్యాల చిత్రాల మాదిరిగా...