పోస్ట్‌లు

sakala janula samme specialnews special articls hot news hot articls gossips kcr telangana saperate hot news rtc buses bandh లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నేడు బ‌స్సులు, రేపు రైళ్ళు, విమానాలు

చిత్రం
తెలంగాణ సాధ‌న‌కోసం చేస్తున్న స‌క‌ల జ‌నుల స‌మ్మెలో భాగంగా సోమ‌వారం నాడు తెలంగాణ వాదులు ర‌హ‌దారుల దిగ్భంధం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల‌లోని అన్ని ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ని దిగ్బంధంనం చేసారు. ఆంధ్రా ప్రాంతంనుండి బ‌స్సుల‌ని రానీయ‌డంలేదు. అలాగే తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్ర‌కి కూడా బ‌స్సు స‌ర్వీసులు ఆగిపోయాయి. ఇప్ప‌టికైనా కేంద్రం దిగివ‌చ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌కుంటే ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తామ‌ని, నేడు బ‌స్సుల దిగ్భంధ‌నంతో మొద‌లైన ఈ ఉద్య‌మం రేపు రైళ్ళ దిగ్బంధం, ఆ త‌ర్వాత విమానాల దిగ్భంధం వ‌ర‌కూ వెళుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నాడు సిద్దిపేట ఎమ్మెల్యే టిఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీశ్‌రావు. హైద‌రాబాద్‌లోని అన్ని రైళ్వే స్టేష‌న్లు, శంషాబాద్‌, బేగంపేట‌లోని విమానాశ్ర‌యాల‌ని ముట్ట‌డిస్తామ‌ని అంటున్నారు. సోమ‌వారం జ‌రుగుతున్న ర‌హ‌దారుల దిగ్భంధంలో భాగంగా అక్క‌డ‌క్క‌డ కొన్ని బ‌స్సుల అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు తెలంగాణ వాదులు. ఈ ఉద్య‌మాన్ని ఎలా ఆపాలో తెలియ‌క ప్ర‌భుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.