పోస్ట్‌లు

dookudu maheshbabu srinuvaitla tollywood movies. movie reviews movie news hot news hot articls hot gossips cine news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రికార్డు స్థాయిలో దూకుడు రిలీజ్‌

చిత్రం
ప్రిన్స్ మ‌హేష్‌బాబు, స‌మంత‌, శ్రీ‌నువైట్ల కాంబి నేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొం దిన చిత్రం దూకుడు. సెప్టెంబ‌ర్ 23వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ‌వుతుంది. మ‌హేష్‌ బాబు ఈ చిత్రంపై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నాడు. త‌న కెరీర్‌లోనే భారీ విజ‌యం సాధించిన పోకిరి చిత్రాన్ని దూకుడు అధిగ‌మి స్తుంద‌ని ఆశిస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలోనూ మ‌హేష్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు నెల‌కొల్పుతోంది. అత్య‌ధిక ప్రింట్ల‌తో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఒక్క హైద‌రాబాద్‌లోనే 70 థియేట‌ర్ల‌కి పైగా విడుద‌ల‌వుతోంది. ఇంతుకుముందు ఏ చిత్రం కూడా ఇన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల కాలేదు. అలాగే చెన్నైలో 15 థియేట‌ర్ల‌లో, అమెరికాలో 85 థియేట‌ర్ల‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. గ‌తంలో ఏ చిత్రం నెల‌కొల్ప‌ని రికార్డు ఇది. ఇక దూకుడు చిత్రం భారీ విజ‌యం సాధిస్తుంద‌ని మ‌హేష్ అభిమానులు కూడా భావిస్తున్నారు. బుధ‌వారం నుండే దూకుడు చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ‌డం, టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవ‌డం కూడా జ‌రిగిపోయింది. భారీ అంచ‌నాల‌తో వ‌...

దూకుడు షూటింగ్‌లో టి-వాదుల ర‌గ‌డ‌

చిత్రం
మహేశ్ బాబు కొత్త సినిమా దూకుడు సినిమాకు తెలంగాణ సెగ అంటుకుంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను తెలంగాణా వాదులు అడ్డుకున్నారు. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ ను ధ్వంసం చేశారు. గత రెండు రోజులుగా వికారాబాద్ రైల్వేస్టేషన్ లో దూకుడు సినిమాకు సంబంధించి కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం.. కొందరు తెలంగాణ వాదులు వచ్చి.. షూటింగ్ ను నిలిపేయాలని కోరారు. కానీ తర్వాత షూటింగ్ యథావిధిగా కొనసాగింది. అయితే సాయంత్రం మరోసారి తెలంగాణ వాదులు.. అడ్డుకున్నారు. అక్కడ వేసిన సెట్లను ధ్వంసం చేశారు. జై తెలంగాణ నినాదాలతో.. షూటింగ్ కు ఆటంకం కలిగించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. అదే సమయంలో.. మహేశ్ బాబు కార్ లో దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌజ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన కారును కూడా అడ్డుకున్నారు. ఒక్కసారిగా కార్లపై రాళ్లతో కర్రలతో దాడి చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే అప్పటికప్పుడే.. మహేశ్ బాబును వేరే కార్లో హైదరాబాద్ కు పంపించారు. దీంతో మహేశ్ సేఫ్ గా బయటపడ్డారు. కాగా సంఘటనా స్థలంలోకి పెద్ద ఎత...