పోస్ట్‌లు

reduce petrol rates ibp indian oil hindustan petroleum august 15th indipendance day manmohan singh soniagandhi political news special news manmohan singh congress party లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మ‌న్మోహ‌నా.. నీకిది త‌గునా..

చిత్రం
భార‌త‌దేశంలోనే ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన నేత మ‌న్మోహ‌న్ సింగ్‌.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ని స‌మ‌ర్థ‌వంతంగా తీర్చిదిద్దిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న‌ని ఏకంగా ప్ర‌ధాని పీఠాన్ని అధిష్ఠించేలా చేసింది. కానీ.. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి అయ్యాక నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌తో పాటు, చ‌మురు ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటాయి. మ‌రో వైపు ధ‌నవంతుల‌కి లాభాలు చేకూర్చే విధంగా కొన్ని ప్ర‌ణాళిక‌లు త‌యార‌వుతున్నాయి. ఉన్నోడు ఇంకా సంపాదిస్తున్నాడు, లేనోడు సంపాదించే అవ‌కాశం లేకుండా వాడిపై అధిక ధ‌ర‌లంటూ, ప‌న్నులంటూ, వ్యాట్‌లంటూ భారాన్ని మోపుతూనే ఉన్నారు. ఇక పెట్రోలు విష‌యానికి వ‌స్తే మ‌న దేశం నెంబ‌ర్ వ‌న్ లో నిలుస్తుంది.. ఎలాగంటారా..  ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలలో పెట్రోలు ధరలు ఎక్కువ‌గా ఉన్న దేశం మ‌న‌దే. పెట్రోలు ఉత్పత్తికి అవసరమైన క్రూడ్ దిగుమతి పేరుతో కొంత వ్యవయం అవుతుంటే, దానిపై వేసే రకరకాల కస్టమ్స్, ఇతర పన్నుల పేరుతో దేశంలో వినియోగదారుడిపై విపరీత భారాన్ని మోపుతున్నారు. కేంద్రం వాటి గురించి మాట్లాడ‌దు. అస‌లు క్రూడాయిల్ ధ‌ర పెరిగింద‌ని ని...