పోస్ట్‌లు

chandrababu naidu telugu desham party congress party ysr congress party ys jaganmohanreddy political news national political news. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వైఎస్ ఆర్ పార్టీలోకి అనంత‌పురం నాయ‌కులు..

చిత్రం
అనంతపురం జిల్లాలో రాజకీయాలలో మార్పు వస్తోంది. జగన్ నేటి నుంచి ఓదార్పు యాత్రను ఈ జిల్లాలో చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రముఖ రాజకీయ కుటుంబాలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నాయి.తాడిపత్రిలో ఇంతకాలం మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి ప్రత్యర్ధులుగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం నేత పేరం నాగిరెడ్డి సోదరులు అమరనాధరెడ్డి, మహేశ్వరరరెడ్డిలు తెలుగుదేశం పార్టీని వదలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు.అయితే పేరం నాగిరెడ్డి టిడిపిలోనే ఉంటారా? లేక ఆయన కూడా తర్వాత కాలంలో చేరతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక నల్లమడ నియోజకవర్గం (పునర్విభజనకు ముందు ఉండేది) మాజీ ఎమ్మెల్యే కె.మోహన్ రెడ్డి కూడా జగన్ కు మద్దతు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇప్పటికే అనంతపురం జిల్లా ఫరిషత్ చైర్ పర్సన్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. కాగా ఎమ్మెల్యేలు గురునాధరెడ్డి, రామచంద్రారెడ్డిలు కూడా జగన్ మద్దతుదారులుగా గుర్తింపు పొందారు. జిల్లా సామాజిక సమీకరణాల రీత్యా కూడా రెడ్డి నాయకులు ఎక్కువమంది కాంగ్రెస్ ను వదలి జగన్ పార్టీలో చేరుతున్నట్లు కనబడుతుంది.అయితే ఇప్పుడు టిడిప...

చంద్రబాబు పత్రికను నడుపుతారా!

చిత్రం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయడు మళ్లీ ఒక పక్ష పత్రికను తీసుకురావాలని భావిస్తున్నారు.ఈ విషయాన్ని ఆయన తన పార్టీ ముఖ్య నాయకులకు మేధోమదనం సందర్భంగా చెప్పారు.ఈ సందర్బంగా పత్రికలు నడుపుతున్న రాజకీయ నాయకులపై ఆయన విసుర్లు విసిరారు. తాము పదిహేడు సంవత్సరాలు అధికారంలో ఉన్నా, ఒక దినపత్రిక నడిపే పరిస్థితిలో లేమని కొందరు బ్లాక్ మెయిల్ ద్వారా డబ్బు తెచ్చి పత్రికను నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ సాక్షి పత్రికను నడుపుతుండగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు నమస్తే తెలంగాణ దినపత్రికను నిర్వహిస్తున్నారు. కాగా వీరిద్దరూ టెలివిజన్ ఛానళ్లను కూడా నడుపు తున్నారు. కాగా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆధ్వర్యంలో ఒక టీవీ ఛానల్ నడుస్తోంది. కాగా ఈ దశలో పక్ష పత్రిక ను తేవాలని, అయితే ఇది కేవలం పార్టీ కార్యకర్తలకే సరఫరా చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.గతంలో కూడా చంద్రబాబు తెలుగుదేశం పేరుతో ఒక పత్రికను నడిపేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న సి.రామచంద్రయ్య దానికి బాధ్యత వహించేవారు.అప్పట...

కాంగ్రెస్ బాట‌లోనే టిడిపి కూడానా..?

చిత్రం
స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు తగ్గించరాదని, అవసరమైతే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోను తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్లను తగ్గించడానికి అనుమతించబోదని ఆయన అన్నారు.స్థానిక సంస్థలలోనే కాక , చట్ట సభలలో కూడా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని ఆయన చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఈలోగా పెట్టాలా? వద్దా అన్నదానిపై మాత్రం చంద్రబాబు మాట్లాడకుండా కేవలం బిసిలకు రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడి సరిపెట్టుకోవడం గమనించదగిన అంశం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయి వర్క్‌ ఫాస్ లో ప్రారంభోపన్యాసం చేశారు.తెలుగుదేశం పార్టీ కూడా రిజర్వేషన్లు తగ్గించకుండానే ఎన్నికలు జరపాలంటే అది హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత సుప్రింకోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం కూడా ఇదే పాయింటును కోరుకుంటోంది. రిజర్వేషన్లు తగ్గించడానికి తాము కూడా ఇష్టపడడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ రకంగా ...

అవిశ్వాసం పై చర్చకు నో చాన్స్..

చిత్రం
తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానం పై శనివారం అసెంబ్లీ లో చర్చ జరిగే అవకాశాలు కన్పించడం లేదు. అసలు అవిశ్వాసం పై అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ ఇచ్చిన నోటీసు నిబంధనలకు విరుద్ధమని  న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ నియమావళి 14వ అధ్యాయం 75 (1) నిబంధన ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వవచ్చు. దానికి కనీసం 10 శాతం మంది సభ్యుల మద్దతున్నదీ లేనిదీ స్పీకర్ నిర్ధారించుకుంటారు. మద్దతుంటే 10 రోజుల్లోగా తీర్మానాన్ని చర్చకు పెట్టాలి.కాగా  స్పీకర్ ఎన్నిక కోసం ఈ నెల 4న అసెంబ్లీ సమావేశమయ్యాక టీడీపీ మళ్లీ అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వాలి . ప్రొటెం స్పీకర్ దాన్ని చర్చకు అనుమతించక పోవచ్చు . ఆ విషయం పై  కొత్త స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. పదో వంతు సభ్యుల మద్దతుందని నిర్ధారణకు వస్తే,దానిపై ఎప్పుడు చర్చించాలో దానిపై సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్  నిర్ణయిస్తారు. అంటే 4న స్పీకర్ ఎన్నిక తప్ప మరే చర్చ...

జగన్ వ్యూహం ఏమిటో..?

చిత్రం
కిరణ్ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి  రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. నిన్న మొన్నటి దాక పదేపదే చంద్ర బాబు కి ధైర్యముంటే అవిశ్వాసం పెట్టాలని సవాళ్ళు విసిరిన జగన్ వర్గానికి  నిజంగా ఇది ఊహించని షాక్. జగన్ ఇపుడు ఏమి చేస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. జగన్ వర్గీయులుగా ముద్ర పడిన వాళ్ళు ఇప్పటివరకు ముప్పై మందికి మించి లేరు. ఈ ముప్పైమంది తో  జగన్ ఏమి చేయలేరు . కనీసం ఆయనకు మద్దతు  ఇచ్చే వాళ్ళు యాభైమంది  వుంటే నే అధికార పార్టీ  ఇబ్బందుల్లో పడుతుంది. మరి అంత మంది వున్నారా ??అనేది బ్రహ్మ రహస్యం .నిన్న గాక మొన్న మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ మా మద్దతు దారులు  మేజిక్ ఫిగర్  కంటే  ఎక్కువే ఉంటారన్న రీతిలో మాట్లాడారు అవిశ్వాసం పెడితే సత్తా చూపుతాం అన్నారు .ఇవన్ని  బాబుని రెచ్చ గొట్టే మాటలు  గానే అందరు భావిస్తున్నారు .ఈ పరిస్తితుల్లో జగన్ ఏ వ్యూహాన్ని అనుసరిస్తారనే విషయం పై ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అధికారం కోస‌మే అవిశ్వాసం పెట్టాలా..?

చిత్రం
అధికారం కోసం తాము వెంపర్లాడటం లేదని టీడీపీ అధినేత చంద్ర బాబు అన్నారు .అధికారం  కోసం  అవిశ్వాసాన్ని ప్రతిపాదించలేదని స్పష్టం చేసారు. అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోతుందా, లేదా అన్నది తాను  చెప్పలేనని, ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, సర్కార్ అసమర్ధతను తెలియజేయడానికే అవిశ్వాసం పెడుతున్నట్టు బాబు   తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో  ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ అన్ని రకాల పోరాటాలు చేసిందని, అయినా  ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాసం పెడుతున్నామని  అన్నారు. కిరణ్ సర్కార్ అసమర్ధత వల్ల రాష్ట్రం 20 ఏళ్ళు వెనుకకు పోయిందని విమర్శించారు . రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా కాంగ్రెస్ చేసిందని బాబు దుయ్య బట్టారు.  అవిశ్వాస తీర్మానానికి ఎవరెవరు మద్దతు ఇస్తారన్నది వారి ఇష్టయిష్టాలబట్టి ఉంటుందని అన్నారు.