జగన్ వ్యూహం ఏమిటో..?


కిరణ్ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి  రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. నిన్న మొన్నటి దాక పదేపదే చంద్ర బాబు కి ధైర్యముంటే అవిశ్వాసం పెట్టాలని సవాళ్ళు విసిరిన జగన్ వర్గానికి  నిజంగా ఇది ఊహించని షాక్. జగన్ ఇపుడు ఏమి చేస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. జగన్ వర్గీయులుగా ముద్ర పడిన వాళ్ళు ఇప్పటివరకు ముప్పై మందికి మించి లేరు. ఈ ముప్పైమంది తో  జగన్ ఏమి చేయలేరు . కనీసం ఆయనకు మద్దతు  ఇచ్చే వాళ్ళు యాభైమంది  వుంటే నే అధికార పార్టీ  ఇబ్బందుల్లో పడుతుంది. మరి అంత మంది వున్నారా ??అనేది బ్రహ్మ రహస్యం .నిన్న గాక మొన్న మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ మా మద్దతు దారులు  మేజిక్ ఫిగర్  కంటే  ఎక్కువే ఉంటారన్న రీతిలో మాట్లాడారు అవిశ్వాసం పెడితే సత్తా చూపుతాం అన్నారు .ఇవన్ని  బాబుని రెచ్చ గొట్టే మాటలు  గానే అందరు భావిస్తున్నారు .ఈ పరిస్తితుల్లో జగన్ ఏ వ్యూహాన్ని అనుసరిస్తారనే విషయం పై ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!