మంత్రులు దద్దమ్మలేనా..?
కాంగ్రెస్ మంత్రులపై, తెలుగుదేశం నాయకులపై తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రులు దద్దమ్మలని ధ్వజమెత్తారు. వారు తమ మాటకు కట్టుబడి ఉండడం లేదని ఆయన విరుచుకుపడ్డారు.మంత్రులు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు.ఇక తెలుగుదేశం నాయకుల సభలను విమర్శిస్తూ, టిడిపి సభలకు మూడువేల మంది జనం వస్తే పోలీసులు నాలుగువేల మంది ఉంటున్నారని ఆయన ఎద్దేవ చేశారు.ఒకపక్క కాంగ్రెస్ మంత్రులు, ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ వెళుతున్న తరుణంలో కెసిఆర్ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి పెంచడానికి కెసిఆర్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం నేతలు ఈమధ్యకాలంలో తనపై ఆరోపణలు గుప్పిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుని కెసిఆర్ తన నల్లగొండ పర్యటనలో ఎదురుదాడి చేశారు.తెలంగాణ ఉద్యమం అంతిమ దశలో ఉందని, అందరూ ఐక్యంగా ఉండి తెలంగాణ సాధించాలని కెసిఆర్ పిలుపు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఉద్యమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ సభలుపెడుతుంటే స్వయంగా టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం, దానిపై టిడిపి నేతలు తిరగబడడం జరుగుతోంది. ఇక తెలుగుదేశంలో నాగం జనార్ధనరెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావుల మధ్య ఆరోపణల పర్వం తీవ్ర రూపం దాల్చింది.
ఇక టిడిపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం శృతి మించింది. కెసిఆర్ వసూల్ రాజా అని టిడిపి విమర్శిస్తుంటే, టిడిపి తెలంగాణ నేతలు చంద్రబాబు బానిసలని టిఆర్ఎస్ విమర్శిస్తోంది.సీమాంధ్రుల కంటే తెలంగాణ నేతలే డేంజర్ గా ఉన్నారని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా మంత్రులు ఇద్దరూ దద్దమ్మలేనని ఆయన మండి పడ్డారు. స్వయానా కెసిఆరే ఈ మాటల యుద్దంలో పాల్గొంటూ అందరూ కలిసి ఉద్యమించాలని అంతిమంగా పిలుపు ఇవ్వడం విశేషం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి