చిరంజీవి బొత్సకు పోటీ కాదా?
పిసిసి అధ్యక్షుడు బొత్సకు మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రత్యర్ధి అనో, పోటీ అనో భావించడం లేదు. దానికి ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.అది కూడా గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు జరిగిన ఒక సన్నివేశాన్ని ఆయన మీట్ ద ప్రెస్ కార్యక్రమం సందర్భంగా వెల్లడించడం విశేషం.రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంత్రి బొత్స ను పిలిచి చిరంజీవి పార్టీలో చేరవచ్చు . ప్రయత్నం చేయరాదు. మీకు సన్నిహితంగా ఉంటారా అని అడిగారు.ఎందుకంటే బొత్స సత్యనారాయణ, చిరంజీవిలు కొంచెం దగ్గరగా ఉండే సామాజికవర్గాలు గా ఉండేవి కనుక బొత్సతో ఆపరేట్ చేయించాలని ఆయన అనుకున్నారు.ఎందుకంటే అప్పట్లో అధికారంలోకి వచ్చింది బొటాబొటి మెజార్టీ కనుక ఎందుకైనా మంచిదని ఆయన ఆలోచన చేసినట్లున్నారు.అయితే బొత్స ఒక సందేహం వెలిబుచ్చారు. శాసనసభ ఎన్నికలలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఓడిపోయి ఉండవచ్చు.కాని చిరంజీవి ఒక పెద్ద పర్సనాల్టీ కదా . ఆయన పార్టీలోకి వస్తే మనకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించారు.దానికి రాజశేఖరరెడ్డి బదులు చెబుతూ మనతోపాటు ఉన్న వ్యక్తో, మనం తెచ్చిన వ్యక్తో మనల్ని మించి ఎదిగిపోతారనుకుంటే అది మన బలహీనత అవుతుంది. అలాకాకుండా మనం ఆయన బలాన్ని వాడుకోగలిగితే అది మనకూ బలమే అవుతుంది అని సూక్ష్మం చెప్పారు. ..కనుక తాను కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటానని, ఎవరూ ఎవరికి పోటీకాదని, అలా అనుకుంటే అది బలహీనత అవుతుందని బొత్స చెప్పారు. మీ సామాజికవ ర్గానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం తర్వాత మీకు పోటీ అవుతారా అని అడిగితే బొత్సీ కధ చెప్పారు. అంటే దీనిద్వారా ఆయన చిరంజీవి తనకు పోటీకారని పరోక్షంగా చెబుతున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి