క్షుద్ర‌పూజ‌ల‌కి అనుకూల స‌మ‌యం ఇదేనా..?




ఆదివారం… అమావాస్య రోజు.. అర్థ‌రాత్రి దాటిన వేళ‌.. స్మ‌శానంలో ఓ క్షుద్ర‌మాంత్రికుడు.. క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నాడు.. దాదాపు అన్ని క‌థ‌ల్లోనూ, న‌వ‌ల‌ల్లోనూ క్షుద్ర‌పూజ‌లు అన‌గానే ఆదివారం, అమావాస్య‌, అర్థారాత్రి.. అన్న‌వి మ‌నం కామ‌న్‌గా వింటూంటాం.. అయితే క్షుద్ర‌పూజ‌ల‌కి మ‌రో అనుకూల‌మైన స‌మ‌యం గ్ర‌హ‌ణ స‌మ‌యం అని న‌మ్ముతారు క్షుద్ర‌మాంత్రికులు.. ఈ గ్ర‌హ‌ణ స‌మ‌యంలో క్షుద్ర‌శ‌క్తుల‌ని మేల్కొలిపి త‌మ కోరిక‌ల‌ని తీర్చుకోవాల‌ని త‌హ త‌హ లాడుతుంటారు.. దీనికోసం న‌ర‌బ‌లుల‌ని, జంతు బ‌లుల‌ని, క‌న్నెపిల్ల‌ల బ‌లుల‌ని ఇవ్వ‌డానికి కూడా వెనుకాడ‌రు.. ఈ కంప్యూట‌ర్ యుగంలో కూడా ఇలాంటి మూఢ‌విశ్వాసాలు ఉన్నాయని, గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఇలాంటి పూజ‌లు జ‌రుగుతాయ‌ని, అది కూడా ఎక్క‌డో స్మ‌శానాల‌లో కాకుండా జ‌నావాసాల మ‌ధ్య‌నే ఈ క్షుద్ర‌పూజ‌లు చేస్తార‌ని అంటే మీరు న‌మ్ముతారా..?  కానీ న‌మ్మాల్సిందే.. ఎందుకంటే.. రాష్ట్రంలోని వ‌రంగల్ జిల్లా హ‌న్మ‌కొండ న‌డిబొడ్డులోనే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.. చాలా ఏళ్ళ త‌ర్వాత సుదీర్ఘంగా ఏర్ప‌డిన సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణ స‌మ‌యంలో క్షుద్ర‌పూజ‌లు నిర్వ‌హించ‌డానికి ఆ క్షుద్ర‌మాంత్రికుడు రెడీ అయ్యాడు.. వివ‌రాల‌లోకి వెళితే.. 
వరంగల్‌లో చంద్రగ్రహణ సమయంలో క్షుద్రపూజలు మొద‌లు పెట్టాడో ఓ మాంత్రికుడు.. అత‌ని పేరు స‌య్య‌ద ఖ‌దీర్‌.. పేరుకు డాక్ట‌ర్‌.. అయినా క్షుద్ర‌పూజ‌ల‌ని కూడా చేసే మాంత్రికుడు..   నయీంనగర్‌ ప్రాంతంలో సయ్యద్‌ ఖదీర్‌ ఆహ్మద్‌ ఫరీన్‌ క్లీనిక్‌ పేరిట ఓ ఆసుపత్రి నెలకొల్పాడు. పేరుకు మాత్రం యూనానీ వైద్యం చేస్తూ….చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు చేస్తే దోషాలు తొలగడంతో పాటు యవ్వనం, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని కొంద‌రిని న‌మ్మించాడు.. మ‌రింకే అత‌ని మాట‌లు విన్న వారంతా ఓకే అనేసారు.. అర్థ‌రాత్రి గ్ర‌హ‌ణ‌కాలం స‌మీపించ‌గానే అత‌ని నాలుగంత‌స్తుల భ‌వ‌నంపై క్షుద్ర‌పూజ మొద‌లెట్టాడు.. నిమ్మ‌కాయ‌లు, ముగ్గుతో వేసిన వృత్తాకారం.. దాని చుట్టూ మంట‌లు.. ఆ మంట‌ల మ‌ధ్య‌లో ఆయ‌న నిల‌బ‌డి మ‌రో ముగ్గురు అమ్మాయిల‌ని నిల‌బెట్టి.. ఏవో మంత్రాలు జ‌పించ‌డం ప్రారంభించాడు.. ఆ త‌ర్వాత ఇంకా ఆయ‌న పూజ‌లు ఎంత దారుణంగా ఉండేవో కానీ.. స‌రిగ్గా అప్ప‌టికే పోలీసులు, మీడియా కంట్లో ప‌డ‌టంతో అడ్డంగా బుక్క‌యిపోయాడు.. వెంట‌నే అత‌న్ని అరెస్టు చేసారు పోలీసులు. రాష్ట్రంలో ఇత‌నొక్క‌డే క్షుద్ర‌పూజ చేస్తూ దొరికిపోయాడు బాగానే ఉంది.. దొర‌క‌ని మాంత్రికులెంద‌రో.. ఈ చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున ఎలాంటి దారుణ‌మైన పూజ‌లు చేసారో..? ఇలాంటి వారి బారిన ప‌డ‌కుండా ప్ర‌జ‌లు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి..!

సి.హెచ్‌. సంతోష్‌కృష్ణ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!