అంద‌రూ ఊహించిన‌ట్టుగానే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నివాసం అయిన యజుర్వేద మందిరంలో అంతులేని సంపద ఉన్న‌ద‌ని తెలిసింది.. భారీగా నగదు, బంగారం నిల్వలు ఉన్నాయి. అదో బంగారు గనిని తలపిస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. పోలీసులు, మీడియాను అనుమతించకుండా గురువారం యజుర్వేద మందిరాన్ని తెరిచిన ట్రస్టు సభ్యులు ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, ఓ బ్యాంకు అధికారి, సత్యసాయి వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ల ఆధ్వర్యంలో గురువారం నుండి లెక్కింపు ప్రారంభించారు. శుక్రవారం కూడా లెక్కింపు కొనసాగుతుంది. యజుర్వేద మందిరంలోని విషయాలపై ట్రస్టు సభ్యులు ముందు నుండి గోప్యంగా ఉంచుతున్నారు. సాయంత్రం వరకు లెక్కింపు పూర్తి కావచ్చునని, ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రత్నాకర్ కూడా శుక్రవారం అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!