నాగ‌చైత‌న్య‌, అనుష్క ఒక్క‌టి కాబోతున్నారా..?


ప్రముఖ సినీ నటుడు నాగార్జున కుమారుడు నాగచైతన్య, ప్రముఖ సినీ నటి అనుష్క లకు నిశ్చితార్ధం జరిగిందని ఒక తమిళ పత్రిక వెల్లడించినట్లు కధనాలు వస్తున్నాయి.వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ఈ మధ్య కొంతకాలం క్రితం అనుష్క తాను ప్రేమలో పడ్డానని అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరా అని అనేకమంది ఆరా తీశారు. మొదట ప్రమేఖ డైరెక్టర్ క్రిష్ అని భావించారట.కాని ఆ తర్వాత తెలిసిందట. ఆ వ్యక్తి నాగచైతన్య అని. వీరిద్దరి ప్రేమకు ఇరువైపుల తల్లిదండ్రులు ఒప్పుకున్నారని, ఆ మీదట వారి నిశ్చితార్ధం రహస్యంగా జరిగిందని సినీరంగంలోపెద్ద ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో , అబద్దం ఎంతోతెలియదు కాని, తమిళపత్రికలు, పలు వెబ్ సైట్ లలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇది నిజమైతే ఆశీర్వదిద్దాం. లేకుంటే అనవసర ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయా అని అంతా బాదపడాలి. అనుష్క వివిధ భాషలలో మంచి నటిగా, గ్లామర్ తారగా పేరు తెచ్చుకున్నారు.నాగ చైతన్య ఇప్పుడిప్పుడే రాణిస్తున్న నటుడు. ఒక వేళ ఇది నిజమైతే నిశ్చితార్ధం రహస్యంగా చేయవలసిన అవసరం ఉందా అన్నది కూడా ప్రశ్న.సినీ ప్రముఖులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవేమో!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!