9 కోట్ల పెనాల్టి ఎలా కడతాడు..?
ప్రముఖ తాంత్రికుడు చంద్రస్వామి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విధించిన తొమ్మిది కోట్ల పెనాల్టీని చెల్లించడానికి ఒప్పుకున్నారు.ఈ మేరకు సుప్రింకోర్టుకు ఆయన తరపున న్యాయవాది చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించింది. చంద్రస్వామి గతంలో విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్నది ఆరోపణ. దీనిపై గత పదిహేను సంవత్సరాలుగా న్యాయపరమైన కోర్టు పోరాటం చేస్తున్నారు.అయితే చంద్రస్వామి ఈ వివాదంతో విసిగిపోయారని, తొమ్మిది కోట్లు చెల్లించడానికి అంగీకరిం చారని చెప్పడంతో కోర్టు ఒక విదంగా ఆశ్చర్యం చెందింది. చంద్రస్వామి, ఆయన ఆశ్రమం ఆర్ధికంగా కష్టాలలో ఉన్నారని చెబుతూ ఈ డబ్బు ఎలా కట్టగలరని ప్రశ్నించారు. అయినప్పటికీ రెండువారాల గడువు ఇస్తూ ఉత్తర్వు చేసింది.ఒకప్పుడు చంద్రస్వామి ఆనాటి ప్రధాని పి.వి.నరసిం హారావుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు.అలాగే ఆయుధాల డీలర్ ఖషోగ్గితో కూడా ఈయనకు సంబంధాలు ఉండేవి.అప్పట్లో ఈయనకు డబ్బు కొరత ఉండేదికాదు. కాని ఆతర్వాత మాజీ ప్రధాని పి.వి.నర సింహారావు తోపాటు ఒక ఛీటింగ్ కేసులో ఇరుక్కోవడం, దానినుంచి బయటపడ్డాక, మరిన్ని కేసులు తలమీదకు రావడంతో చంద్రస్వామి చిక్కులలో పడ్డారు. కొన్నికేసులకు సంబందించి ఇరవై ఐదు లక్షల చెక్ ను కూడా ఆయన తరపు న్యాయవాది తెచ్చారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చంద్రస్వామి తొమ్మిది కోట్ల రూపాయలు ఎలా కట్టగలుగు తారా అని ఆసక్తిగా చూస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి